📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Waterfall: టైగర్‌ వాటర్‌ఫాల్స్‌ లో చెట్టు కూలి ఇద్దరు మృతి

Author Icon By Vanipushpa
Updated: May 27, 2025 • 1:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని డెహ్రాడూన్‌(Dehradun)లో ఘోర ప్రమాదం జరిగింది. చక్రతాలోని ‘టైగర్ వాటర్ ఫాల్స్ ‘(Tiger Waterfall)ను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై భారీ చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఢిల్లీ(Delhi)కి చెందిన ఒక పర్యాటకుడు సహా ఇద్దరు మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కొండపై నుండి అకస్మాత్తుగా ఒక భారీ చెట్టు పడి జలపాతం కింద స్నానం చేస్తున్న వారిపై కూలింది. పడిపోయిన చెట్టు కింద ఇద్దరూ చిక్కుకోగా, కొమ్మలు పడిపోవడంతో మరో ముగ్గురు పర్యాటకులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.

Waterfall: టైగర్‌ వాటర్‌ఫాల్స్‌ లో చెట్టు కూలి ఇద్దరు మృతి

ఒక్కసారిగా కుప్పకూలిన భారీ చెట్టు
మృతులు చక్రతాలోని సుజౌ గ్రామానికి చెందిన స్థానికుడు గీతారామ్ జోషి (48), ఢిల్లీలోని షాహ్దారాకు చెందిన అల్కా ఆనంద్ (55)గా గుర్తించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కసారిగా భారీ చెట్టు కుప్పకూలటం చూసిన స్థానికులు, సందర్శకులు వెంటనే సహాయం కోసం పరుగెత్తారు. చెట్టు కింద చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసి అంబులెన్స్ ద్వారా చక్రతా సిహెచ్‌సికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఇద్దరూ అక్కడికి చేరుకునేలోపే మరణించారని వైద్యులు ప్రకటించారు.

Read Also: Viral Video: చెంపదెబ్బ కొట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడికి భార్య

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Tiger Waterfalls Today news Two killed in tree fall

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.