TTD: ప్రత్యేక కమిషన్ ‘కల్తీ’ నెయ్యిలో అసలు రహస్యం తేల్చుతుందా!?

Read Time:  1 min
TTD
TTD
FONT SIZE
GET APP

తిరుమల : తిరుమల లడ్డూల తయారీకి జంతువులనూనె, ఇతర శాఖాహారపదార్థాలతో కల్తీచేసి సరఫరా చేశారని తేల్చిన సిబిఐ సిట్ నివేదికలతో అసలు సూత్రదారులు తేల్చలేకపోవడంతో దీనిపై రాష్ట్రప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పాత్ర ధారులను వెల్లడించిన సిట్ నివేదికలు సూత్ర ధారులు ఎవరనేది పేర్కొనలేకపోవడంతో తప్పులుచేసిన వారిని పట్టుకోవాలనే ధృడ నిశ్చయంతో ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు ప్రత్యేకంగా నిపుణులతో కమిషన్ ఏర్పాటుచేసి సిట్ సిఫార్సుల్లో లోపాలను వెదికి తదుపరి ప్రభుత్వం దగ్గరున్న సమాచారంతో సూత్రధారుల్ని తేల్చడానికి కమిషన్ ఏర్పాటు ఆవశ్యమనేది మంత్రిమండలి నిర్ణయించింది. ఇప్పుడు ఈ కమిషన్లో ఎవరెవరుండనున్నారు? ఏ కోణంలో ఎవరిని విచారణ చేయనున్నారనేది గుబులు రేకెత్తిస్తోంది.

Read also: AP: TTD ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్ బదిలీ

TTD

Will the special commission uncover the real secret behind the ‘adulterated’ ghee!?

ఇప్పటికే సిబిఐ సిట్ అధికారులు ఏడాదిన్నరపైగా క్షేత్రస్థాయిలో కీలక విచారణ చేపట్టి లడ్డూలకు కల్తీనెయ్యి వాడకంపై 14మంది వరకు నిందితుల్ని అరెస్టుచేసి రిమాండ్కు తరలించిన విషయం విదితమే. 2019-24 మధ్యకాలంలో కీలకంగా 2020లో నెయ్యి సరఫరాకు నిబంధనలు మార్చారని, పూర్తిగా కాంట్రాక్టులను అర్హతలేని డెయిరీలకు ఇచ్చారనేది ప్రధానంగా తేల్చిన అంశం. అప్పటి టిటిడి బోర్డు పెద్దలు, పూర్వ అధికారుల పనితీరుపై పలురకాల ఆరోపణలు, విమర్శల నివేదికలతో ఇఒ అనిల్ కుమార్సంఘాల్ ప్రభుత్వం బదలీ చేసింది. ఇప్పుడు ఈ ప్రత్యేక కమిషన్ ఏర్పాటై, రంగంలోకి దిగితే సూత్రధారులను తేల్చాలనేది ముఖ్యసారాంశం. ఇదే జరిగితే నిబంధనలు మార్చి, కల్తీకి ఊతమిచ్చారనే అంశంలో సూత్రధారుల అరెస్టు వరకు కూడా ఈ ప్రత్యేక కమిషన్ వెనుకంజవేయదనేది హాట్గాఫిక్ గా మారింది.

2020-24 మధ్య కాలంలోనే లడ్డూల తయారీలో కల్తీనెయ్యి ఘటనపై టెండర్లు కేటాయించినప్పటినుండి నెయ్యి సరఫరా చేసిన రోజుల వరకు పూర్తిగా సిట్ సమగ్రంగా దర్యాప్తు చేపటికట నివేదికలు ప్రభుత్వానికి అందజేసింది. ఇంకా ఉన్న పలు అనుమానాల్లో ఉన్న వివరాలను రాబట్టేందుకు ఈ ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకానుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలకంగా మారిన కేసులో మరీ రానున్న రోజుల్లో ఎలాంటి సంచనాలు వెలుగుచూడనున్నాయనేది అటు టిటిడి వర్గాల్లో ఇటు గత బోర్డు పెద్దల్లో గుబులురేకెత్తిస్తోంది. కల్తీనెయ్యి పాపంలో సిట్ అధికారులు ఇప్పటికే పాత్రధారులైన వారందరినీ అరెస్టుచేసింది. టిటిడిలో మార్కెటింగ్, కొనుగోళ్ళ విభాగం అధికారులను కూడా నిందితులుగా పేర్కొంది. ఇద్దరు మాజీ జిఎంలను ఆరెస్ట్ చేసింది. ఇదే వ్యవహారంలో గతంలో టిటిడిలో కీలకంగా వ్యవహరించిన ఓ అధికారితోబాటు గత బోర్డులో కొందరు పెద్దలను తెరపైకి తీసుకురావాలనేది ప్రభుత్వం నిర్ణయం కీలకంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.