📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Hyderabad: ఉద్యోగం ఇచ్చిన సంస్థకే ఎసరు ఇంతకీ ఎం చేసాడంటే?

Author Icon By Anusha
Updated: May 9, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాపం ఉపాధి లేదని ఉద్యోగం ఇస్తే అన్నం పెట్టాలనుకున్న సంస్థకే సున్నం పెట్టేందుకు ప్రయత్నించాడు. కొలువులో చేరిన తొలిరోజే తన ‘చేతి’వాటం చూపించాడు. గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్‌గా పని కానిచ్చేశాడు. లక్షల విలువైలన రెండు యాపిల్ ఐఫోన్లు కొట్టేశాడు. హైదరాబాద్ బేగంపేటలోని జెప్టో ఆన్‌లైన్ నిత్యావసరాల సంస్థ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టోర్‌ప్యాకర్‌గా విధుల్లోకి చేరిన మరుక్షణమే రెండు విలువైన ఐఫోన్‌లను కొట్టేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,బాలానగర్ ప్రాంతానికి చెందిన గౌతమ్‌ అంకిత్‌(Goutham Ankith) ఈ నెల 3న బేగంపేటలోని ఎఫ్‌డీఆర్‌ఆర్‌డీ టవర్స్‌లో ఉన్న జెప్టో కార్యాలయంలో స్టోర్‌ప్యాకర్‌గా విధుల్లో చేరాడు. కార్యాలయాన్ని ఒకసారి పరిశీలిస్తానని చెప్పి లోపలికి వెళ్లిన అతడు అక్కడ స్టోర్ చేసి పెట్టిన రెండు ఖరీదైన ఐఫోన్‌లను చాకచక్యంగా కొట్టేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన గౌతమ్ తిరిగి విధులకు రాలేదు. కొద్దిసేపటి తర్వాత స్టోర్‌లో నిర్వహించిన ఆడిట్‌లో రెండు ఐఫోన్‌లు(I phone) కనిపించకపోవడంతో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. వెంటనే సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. అందులో గౌతమ్‌ అంకిత్‌ ఆ సెల్‌ఫోన్‌లను దొంగిలించడం స్పష్టంగా కనిపించింది. దీంతో వెంటనే వారు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌతమ్ అంకిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న రెండు ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: ఉద్యోగం ఇచ్చిన సంస్థకే ఎసరు

ఉదంతం

ఈ సంఘటన ఉద్యోగ నియామక ప్రక్రియల్లో భద్రతా చర్యలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ముందస్తు వెరిఫికేషన్ లేకుండా ఉద్యోగానికి తీసుకోవడం ఎంత ప్రమాదకారిగా మారొచ్చో ఇది స్పష్టంగా చూపించింది. జెప్టో సంస్థ మేనేజ్మెంట్ ఇప్పటికే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది.ఇటీవల హైదరాబాద్ నగరంలో(Hyderabad) ఇలాంటి చోరీలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన వారు నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా చేరిన మహిళ రోగుల వద్ద నుంచి నగలు, డబ్బులు దొంగిలించిన ఘటన మరవకముందే ఈ కొత్త ఉదంతం వెలుగులోకి రావడం గమనార్హం. ఉద్యోగం పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఈ సంఘటన ఉద్యోగ నియామక ప్రక్రియల్లో మరింత జాగ్రత్త తీసుకోవలసిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది. సంస్థలు కొత్తగా నియమించే ఉద్యోగుల విషయాల్లో మరింత జాగ్రత్త వహించాలి అనే అవసరం వ్యక్తమవుతోంది. ఈ ఘటన ఇతర ప్రైవేట్ కంపెనీలకు ఒక హెచ్చరికగా మారింది.

Read Also :UGC NET: యూజీసీ నెట్ జూన్‌ 2025 దరఖాస్తు గడువు పెంపు

#BegumpetNews #EmployeeTheft #FirstDayCrime #iPhoneTheft #WorkplaceCrime #ZeptoTheft Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.