📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Swetcha: యాంకర్ స్వేచ్ఛతో సంబంధంపై లేఖ విడుదల చేసిన పూర్ణ చందర్

Author Icon By Anusha
Updated: June 29, 2025 • 8:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు మీడియా రంగాన్ని విషాదంలో ముంచిన న్యూస్ యాంకర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం కేసు ఇప్పుడు అనూహ్య మలుపు తీసుకుంది. ఆమె మరణాన్ని ఆత్మహత్యగా భావిస్తూ, దీనికి కారణం పూర్ణచందరే అని ఆమె తండ్రి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలకు స్పందనగా, పూర్ణచందర్ ఒక ఐదు పేజీల లేఖను విడుదల చేయడం ఈ ఘటనను మరింత వివాదాస్పదంగా మార్చింది.పూర్ణచందర్ (Poorna Chandra) తన లేఖలో ఈ విదంగా పేర్కొన్నారు, 2009 నుండి స్వేచ్ఛతో తనకు స్నేహం ఉందని తెలిపారు. ఇద్దరూ అనేక వ్యక్తిగత విషయాలను పంచుకునేవారన్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి కార్యకర్తలుగా పనిచేస్తూ, ఆరు నెలల వయసులో ఉన్న స్వేచ్ఛను ఆమె అన్న, వదినల సంరక్షణలో వదిలేసి, సంవత్సరానికి ఒకసారి మాత్రమే చూసి వెళ్లేవారని స్వేచ్ఛ తరచుగా తనతో ప్రస్తావించేదని పూర్ణచందర్ పేర్కొన్నారు.

ఆమె ఎప్పుడూ సంతోషంగా లేదని

స్వేచ్ఛ 2008-2009 మధ్య తన మొదటి వివాహం నుండి విడాకులు తీసుకున్నారని, దురదృష్టవశాత్తు 2016-2017 మధ్యకాలంలో రెండో వివాహానికి కూడా విడాకులు పొందారని, తన జీవితంలో ఆమె ఎప్పుడూ సంతోషంగా లేదని, ఆ ఆనందాన్ని కేవలం తన వృత్తిలోనే వెతుక్కునేదని పూర్ణచందర్ వివరించారు.2020 అనంతరం స్వేచ్ఛ తనకు మరింత చేరువైనట్లు పూర్ణచందర్ అంగీకరించారు. తల్లిదండ్రుల మధ్య తరచుగా జరిగే గొడవలు తట్టుకోలేక, రామసాగర్ నుంచి కవాడిగూడ (Kavadiguda) కు సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. 2022లో తన కుమార్తెను కూడా తన వద్దకు తీసుకొచ్చి, ఆమె బాధ్యతలన్నీ తానే చూసుకుంటానని చెప్పినప్పటికీ, తండ్రి స్థానంలో తాను ఆ పాప సంరక్షణ బాధ్యతలు చూసుకున్నానని పూర్ణచందర్ వెల్లడించారు. గత ఏడాది, పాప, స్వేచ్ఛ ఇద్దరూ బాధపడకూడదని రూ. 5 లక్షలు ఖర్చు చేసి పాప మెచ్యూరిటీ ఫంక్షన్ కూడా నిర్వహించామని ఆయన తెలిపారు.

Swetcha:

తనను ఎంతగానో బాధించాయని ఆయన పేర్కొన్నారు

అంతేకాకుండా, స్వేచ్ఛ డిప్రెషన్, ఆందోళన, మానసిక ఆవేదనల నుండి బయటపడటానికి అనేకసార్లు ఆసుపత్రికి తీసుకువెళ్ళానని, ఆ రిపోర్ట్స్ అన్నీ తన గదిలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.స్వేచ్ఛతో గానీ, ఆమె బిడ్డతో గానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని పూర్ణచందర్ స్పష్టం చేశారు. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి స్వేచ్ఛ తండ్రి ఆమె ఇంటికి వచ్చి మాట్లాడిన మాటలు తనను ఎంతగానో బాధించాయని ఆయన పేర్కొన్నారు. తన గురించి చెప్పగానే స్వేచ్ఛ తండ్రి చాలా అవమానకరంగా మాట్లాడారని రాసుకొచ్చారు. ‘రెండేళ్లకొకసారి ఇతను మీ అల్లుడు అని చెబితే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, డబ్బు లేకపోయినా గౌరవాన్ని కోల్పోలేనని’ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి స్వేచ్ఛ (Swetcha) తనకు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుందని పూర్ణచందర్ వివరించారు. తాను వారిని ఎలా చూసుకున్నానో స్వేచ్ఛ బంధువులందరికీ తెలుసని, తనను స్వేచ్ఛ భర్తగా భావించి అన్ని సామాజిక మాధ్యమాల్లో స్వేచ్ఛ పూర్ణచందర్ అని రాసుకుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Read Also: Medak: కోర్టు భవనంపై నుంచి దూకిన ఫ్యామిలీ ఎందుకంటే?

#JournalistSwechha #SwechhaCase #SwechhaNewsAnchor #SwechhaSuicide Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.