📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Supreme Court: మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు

Author Icon By Vanipushpa
Updated: April 10, 2025 • 7:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏదయినా అన్యాయం జరిగితే కొంతకాలం పోరాడి, న్యాయం జరగకపోతే ఇక న్యాయం జరగదని వదిలేస్తాం. కానీ ఓ కుటుంబం మాత్రం కామాంధుడికి శిక్ష పడేంతవరకు పోరాడింది. 40 ఏళ్ల క్రితం ఆమె ఓ చిన్నారి. ఆ సమయంలో ఆమెపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు కోర్టుకు వెళ్లింది. ఆ కోర్టు ఈ కోర్టు అంటూ ఆ బాలిక తల్లిదండ్రులు నిందితుడికి శిక్షపడాలని, తమ చిన్నారిపై అత్యాచారం చేసిన వాడికి చట్టం తప్పకుండా శిక్షిస్తుందని, తమకు న్యాయం జరుగుతుందని నమ్మి.. ఏకంగా 40 ఏళ్ల పాటు పోరాటం చేశారు. 1986లో ఓ మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. నిందితుడికి శిక్ష విధించాలని ఆదేశించింది.

కేసు పూర్తి వివరాలు
రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఓ బాలికపై 1986లో 21 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. నవంబర్ 1987లో ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ, ట్రైయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నిందితుడు రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. బాధితురాలు తనపై జరిగిన నేరం గురించి ఏమీ చెప్పలేదు. ఈ ఆధారాలతో శిక్ష విధించలేమంటూ రాజస్థాన్‌ హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
నిర్దోషిగా విడుదల చేసిన తీర్పును పక్కన పెట్టిన కోర్టు
బాధితురాలు మైనర్‌, ఆమె మౌనాన్ని పెద్దల మౌనంతో సమానంగా చూడలేం. తనపై జరిగిన దారుణం నుంచి ఉద్భవించిన మౌనం అయిఉండొచ్చు. మొత్తం ప్రాసిక్యూషన్ భారాన్ని ఆమె చిన్న భుజాలపై మోపడం అన్యాయం” అని న్యాయమూర్తులు అన్నారు. నిందితుడు ఇప్పటికే శిక్ష అనుభవించకపోతే, ట్రయల్ కోర్టు విధించిన శిక్షను అనుభవించడానికి నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News raping a minor sentences Kamandhu to 40 years Supreme Court Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.