📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Honeymoon Murder: నేరం ఒప్పుకున్నసోనమ్‌, ఇతర నిందితులు

Author Icon By Vanipushpa
Updated: June 9, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హనీమూన్‌ టూర్‌(Honeymoon Tour)లో ఇండోర్‌వాసి రాజా రఘువంశీ(RajaRaghuvamshi) హత్యకు సూత్రధారి భార్య సోనమే(Sonam)నని తేల్చారు పోలీసులు. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి.. షిల్లాంగ్‌లో హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. సోనమ్‌తో పాటు మధ్యప్రదేశ్‌కి చెందిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
భర్తతో పాటే ఆ నవవధువుని కూడా దుండగులు చంపేసి ఉంటారనుకున్నారు. ఆమె మృతదేహం కోసమే పోలీసులు వెతికారు. సోనమ్‌ని కిడ్నాప్‌ చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానించారు. సోనమ్‌ కోసం పోలీసులు షిల్లాంగ్‌ని జల్లెడపడుతుంటే.. తను యూపీలోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది.

Meghalaya Honeymoon Murder: నేరం ఒప్పుకున్నసోనమ్‌, ఇతర నిందితులు

ఓ జలపాతం లోయలో రఘువంశీ మృతదేహం
మే11న రఘువంశీతో అట్టహాసంగా జరిగింది సోనమ్‌ పెళ్లి. మే 20న హనీమూన్‌ కోసం ఇండోర్‌ జంట మేఘాలయకు వచ్చింది. 23న ఆ జంట అదృశ్యమైతే 11రోజుల తర్వాత జూన్‌2న చిరపుంజి సమీపంలోని ఓ జలపాతం లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమైంది. స్పాట్‌లో కనిపించని సోనమ్‌.. 6 రోజుల తర్వాత యూపీలోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
తన జీవితంలోకి ఆహ్వానించిన భర్తకి హనీమూన్‌లో స్పాట్‌ పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆనందంగా పెళ్లి చేసుకుని ఉత్సాహంగా రఘువంశీతో హనీమూన్‌కి వచ్చిన సోనమ్‌ ఇంత ప్లాన్డ్‌గా అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ పెళ్లి ఆమెకు ఇష్టంలేదా? మరొకరితో ప్రేమలో ఉందా? పెళ్లిని తిరస్కరించే అవకాశముండీ.. హనీమూన్‌దాకా తీసుకొచ్చి ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టింది. ఈ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు రాబట్టారు పోలీసులు.
ఐదేళ్లు చిన్నవాడైన రాజ్‌ కుష్వాహాతో సోనమ్‌ కు ఎఫైర్‌
తమ దగ్గర పనిచేసే ఐదేళ్లు చిన్నవాడైన రాజ్‌ కుష్వాహాతో ఎఫైర్‌ పెట్టుకుంది సోనమ్‌. పెళ్లయ్యాక కూడా అతనితో సన్నిహితంగానే ఉంది. తమ బంధానికి మూడుముళ్ల బంధం అడ్డవుతుందని భావించింది. అందుకే హనీమూన్‌ పేరుతో భర్త అడ్డు తొలగించుకుంది. రాజా రఘువంశీ మర్డర్‌కి మాస్టర్‌మైండ్‌ రాజ్‌ కుష్వాహానే. విక్కీఠాకూర్‌, ఆనంద్‌ అతనికి సహకరించారు. షిల్లాంగ్‌లో వారు అపరిచితుల్లా కలిశారో, సోనమ్‌ పరిచయం చేసిందో తేలాల్సి ఉంది. కానీ భార్య కుట్ర తెలియని రఘువంశీ వారితో మాటలు కలిపాడు. కబుర్లు చెప్పుకుంటూ ముందుకెళ్లాడు. ఎవరూలేని నిర్మానుష్య ప్రదేశంలో రఘువంశీని చంపేసి లోయలో పడేశారా దుర్మార్గులు.
నిందితులు దొరికిపోవటంతో ఒంటరైపోయింది సోనమ్‌
మేఘాలయ హనీమూన్‌ ప్లానింగ్‌ సోనమ్‌దే. టికెట్లు కూడా తనే బుక్‌ చేయించింది. కానీ రిటన్‌ టికెట్‌ బుక్‌ చేయకపోవడాన్ని బట్టే హత్య కుట్రలో ఆమె పాత్ర కీలకమని పోలీసులకు అర్ధమైంది. ముగ్గురు నిందితులు దొరికిపోవటంతో ఒంటరైపోయింది సోనమ్‌. ఘాజీపూర్‌ చేరుకుని రాత్రి రెండుమూడుగంటలు ఓ డాబా దగ్గర ఉండిపోయింది. చివరికి పోలీసులకు లొంగిపోయింది. నిందితుల కన్ఫెషన్‌తో సోనమ్‌ సుపారీతోనే మర్డర్‌ జరిగినట్లు పోలీసులు కన్‌ఫం చేసుకున్నారు. మేఘాలయ పోలీస్‌ టీమ్‌ ఘాజీపూర్‌కి చేరుకుంది. తన కూతురిపై అన్యాయంగా అభాండాలు మోపుతున్నారంటున్నాడు సోనమ్‌ తండ్రి దేవిసింగ్‌. కూతురిలా దగ్గరైన కోడలు తనకు కడుపుకోత మిగిలిస్తుందని అనుకోలేదని కన్నీటిపర్యంతమవుతోంది రఘువంశీ తల్లి.

Read Also: Raja Raghuvanshi: కోడలే మా కుమారుడిని హతహమార్చిందంటూ తల్లి ఆవేదన

#telugu News Ap News in Telugu Breaking News in Telugu confess to crime Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Sonam Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.