📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Secunderabad: కొత్త జంట హనీమూన్ ప్రయాణం​.. ప్రమాదంలో వరుడు మృతి

Author Icon By Anusha
Updated: June 7, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మరణం ఎప్పుడెక్కడ వస్తుందో చెప్పలేం.ఇది శాశ్వత సత్యం. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో రాత్రి నిద్రపోయిన మనిషి ఉదయం కన్ను తెరిస్తాడో లేదో కూడా గ్యారెంటీ లేదు. అలాంటి విషాద సంఘటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌(Secunderabad railway station)లో చోటుచేసుకుంది.ఇలానే కొత్తగా పెళ్లైన ఓ జంట రైలులో హనుమూన్​కు వెళుతుండగా ట్రైన్​ ఆలస్యం వరుడి ప్రాణాలు బలిగొంది. దీంతో గమ్యం చేరకుండానే వారి ప్రయాణం విషాదంగా ముగిసింది.సికింద్రాబాద్​ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్​ పట్టణానికి చెందిన రమేశ్​ కుమారుడు ఉరగొండ సాయి (28) స్థానికంగా గిప్ట్​ ఆర్టికల్స్(Gift articles)​ తయారీ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి 3 నెలల క్రితం వివాహం అయింది. వివాహం అయిన తర్వాత కొత్త జంట హనీమూన్​ ప్లాన్​ చేసుకొని గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు రైల్వే టికెట్లు కూడా రిజర్వేషన్​ చేసుకున్నారు.

ఆలస్యం కావడంతో

గోవా వెళ్లడానికి, శుక్రవారం ఉదయం భార్య, బావమరిది, నలుగురు స్నేహితులతో కలిసి సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​కు చేరుకున్నారు. అప్పటికే రైలు రైల్వేస్టేషన్​లో 9వ నంబరు ప్లాట్​ఫాంపై ఆగి ఉంది. అందరూ వాస్కోడిగామా ఎక్స్​ప్రెస్​(Vascoda Gama Express) ఎక్కి తమ తమ సీట్లలో కూర్చోగా, రైలు బయలుదేరడానికి ఆలస్యం కావడంతో ప్లాట్​ఫాంపై ఉన్న స్టాల్​లో వాటర్​ బాటిల్​ కొనేందుకు సాయి రైలు దిగాడు.

Secunderabad

ఆసుపత్రికి తరలించారు

అతడు దిగి వాటర్​ బాటిల్​ కొంటుండగా, అంతలోనే రైలు బయలుదేరడంతో బోగీలో ఉన్న స్నేహితులు చైన్​ లాగారు. దీంతో రైలు ఆగింది. ఏం జరిగిందోనని ఆర్పీఎఫ్​ పోలీసులు బోగీలోకి వెళ్లి ప్రశ్నించారు. వారంతా విషయం చెప్పారు. దీంతో సాయి స్నేహితులైన ఇద్దరు యువకులను పోలీసులు ప్లాట్​ఫాంపైకి తీసుకువచ్చారు. అప్పుడే రైలు ఎక్కిన సాయి విషయం తెలుసుకొని తిరిగి ప్లాట్​ఫాం మీదకు చేరుకున్నాడు.అక్కడున్న పోలీసులకు ఫైన్​ కడతామని, రైలు వెళ్లిపోతుందని వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాడు.ఇంతలోనే రైలు బయలుదేరింది.రైలులో భార్య, బావమరిది, మరో ఇద్దరు స్నేహితులు ఉండగా, అతడు వేగంగా వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు, ప్లాట్​ఫామ్ మధ్యలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Hyderabad Metro: మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

#NewlywedTragedy #SecunderabadRailwayStation #TragicJourney #TrainAccident Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.