📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

ప్రముఖ సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య

Author Icon By Vanipushpa
Updated: February 24, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్ బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు తన గదిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా నుంచి బెంగళూరుకు వచ్చిన వారం రోజుల్లోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు, భార్య, ఆమె కుటుంబసభ్యుల వేధింపులతోనే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడినట్టు అభినవ్ తండ్రి బిజయ్ ఆరోపించారు. ఈ మేరకు మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.


విషం తాగి ఆత్మహత్య
ఒడిశాలోని కటక్‌కు చెందిన అభినవ్ సింగ్.. జగ్గర్నాట్‌గా గుర్తింపు పొందిన ఒడియా ర్యాపర్. అతడు ఫిబ్రవరి 9న బెంగళూరులోని కడుబీసనహళ్లిలోని తాను అద్దెకు ఉండే అపార్ట్ మెంట్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ రోజు రాత్రి స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన అభినవ్.. తన గదికి తిరిగొచ్చిన తర్వాత విషం తాగాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యగా కేసు కేసు నమోదు చేసి.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అభినవ్ కుటుంబానికి అప్పగించారు.
బంధువుల వేధింపులే కారణమా?
అభినవ్ సింగ్ ఆత్మహత్యకు భార్య, ఆమె తరఫు బంధువుల వేధింపులే కారణమని మొత్తం 10 మంది పేర్లను పోలీసులకు చేసిన ఫిర్యాదులో అతడి తండ్రి పేర్కొన్నాడు. ఒడియా ర్యాప్ సాంగ్స్‌తో అభినవ్ పాపులర్ అయ్యారు. కథక్ ఆంథమ్ సాంగ్ సూపర్ హిట్‌గా నిలవడంతో మరింత ఒడియాలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. చాలా మంది ప్రముఖ కళాకారులతో కలిసి పని చేశాడు. భార్యతో వివాదాల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. భార్య వేధింపులా? వేరే ఇతర కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అతడు తాగిన విషం? ఏంటనేది తెలియదని.. ల్యాబ్‌ పరీక్షలకు నమూనాలను పంపామని వివరించారు.
మరో మహిళతో సన్నిహితంగా
గతంలో చాలా ఏళ్లు బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజినీర్‌గా పనిచేశాడు. గతేడాది భువనేశ్వర్‌లోని ఓ హోటల్‌లో మరో మహిళతో ఉండగా.. భార్య‌కు రెడ్ హ్యాండెడ్‌ దొరికిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. అప్పట్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇది కుట్రపూరితంగా జరిగిందని అభినవ్ ఆరోపించారు. తన మ్యూజిక్ ఆల్బమ్ విడుదల కాకుండా అడ్డుకోడానికే కుట్రలు చేశారని తెలిపారు.

#telugu News Abhinav Singh Ap News in Telugu Breaking News in Telugu committed suicide Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Renowned singer and rapper Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.