📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Raja Raghuvanshi: రాజా రఘువంశీని తలపై కొట్టి హతమార్చారు

Author Icon By Anusha
Updated: June 10, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండోర్‌కు చెందిన,రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హనీమూన్ కోసం భార్య సోనమ్‌తో కలిసి మేఘాలయ వెళ్లిన రఘువంశీ(Raja Raghuvanshi) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు చుట్టుముట్టాయి.భార్య సోనమ్‌తో కలిసి వెళ్లిన రఘువంశీ అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ తర్వాత ఆయన భార్యే ఈ హత్య చేయించిందన్న ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా నిన్న ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఘజియాపూర్‌లో పోలీసులకు సోనమ్ లొంగిపోవడంతో ఈ కేసు మరింత కీలక మలుపు తిరిగింది.రాజా రఘువంశీ, సోనమ్ దంపతులు మే 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. రెండు రోజుల తర్వాత మే 22న ద్విచక్ర వాహనం అద్దెకు తీసుకుని మౌలికాయత్(Maulikayat) అనే గ్రామానికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ తర్వాతి రోజు నుంచి వారి ఆచూకీ గల్లంతైంది. సుమారు పది రోజుల అనంతరం సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. రఘువంశీ తలపై రెండు బలమైన గాయాలున్నాయని, ఒకటి తల ముందు భాగంలో, మరొకటి వెనుక భాగంలో తగిలినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ గాయాలు లోతుగా ఉండటంతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది.

సోనమ్ ప్రమేయం

ఈ హత్య వెనుక భార్య సోనమ్ హస్తం ఉందని, సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో ఈ దారుణానికి పాల్పడిందని మేఘాలయ పోలీసులు(Meghalaya Police) అనుమానిస్తున్నారు. సోనమ్‌కు రాజ్ కుష్వాహ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, అతడితో కలిసే ఈ హత్యకు పథకం రచించిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కుష్వాహ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు ఆకాష్ రాజ్‌పుత్, వికాస్ అలియాస్ విక్కీ, ఆనంద్‌లను మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్లు మేఘాలయ డీజీపీ ఇడాశిష నాన్‌గ్రాంగ్ ధ్రువీకరించారు. భర్త హత్యలో సోనమ్ ప్రమేయం ఉందని, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. రఘువంశీ మృతదేహం లభ్యమైన వారం రోజుల తర్వాత సోనమ్ లొంగిపోవడం గమనార్హం.

Raja Raghuvanshi

ఆమెపై తప్పుడు

ఈ ఆరోపణలను సోనమ్ తండ్రి తీవ్రంగా ఖండించారు. తన కుమార్తె అమాయకురాలని, మేఘాలయ పోలీసులు ఆమెపై తప్పుడు కేసు బనాయించి ఇరికించారని ఆరోపించారు. ఈ కేసుపై సీబీఐ(CBI)తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తానని తెలిపారు. తనను ఎవరో కిడ్నాప్ చేసి, దోచుకోవడానికి ప్రయత్నించారని సోనమ్ ఫోన్‌లో చెప్పిందని, తాను ఘజియాబాద్‌(Ghaziabad)కు ఎలా వచ్చానో కూడా తనకు తెలియదని వాపోయినట్లు ఆయన వివరించారు. ఈ పరస్పర విరుద్ధమైన వాదనలతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read Also: Viral Video: రెండు ఎద్దుల పొట్లాట ఓ వృద్దుడి మృతి

#HoneymoonTragedy #MeghalayaIncident #MissingCase #RajaRaghuvamshi Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.