రాజ్ కుష్వాహా(Raj Kushewah)తో సోనమ్(Sonam) సంబంధం గురించి ఇంట్లో వాళ్లకి ముందే తెలుసన్నారు రఘువంశీ సోదరుడు విపిన్. ఇష్టం లేకున్నా బలవంతంగా రఘువంశీతో పెళ్లి జరిపించారన్నాడు. పెళ్లి చేసుకుంటాను.. ఆ తర్వాత రఘువంశీ(Raghuvamsi)ని ఏం చేస్తానో చూడు.. అవన్నీ మీరు భరించాల్సిందేనని సోనమ్ తన తల్లితో చెప్పిందన్నాడు విపిన్. ఇదే విషయాన్ని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
పథకం ప్రకారం తన కొడుకును పెళ్లాడింది
మరోవైపు తన బిడ్డ హత్యకు కుజదోషమే కారణమని ఆరోపించింది రఘువంశీ తల్లి. సోనమ్‌కు కుజదోషం ఉందని.. దాన్ని తొలగించుకోవడం కోసం పథకం ప్రకారం తన కొడుకును పెళ్లాడిందన్నారు. గౌహతి కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు అందులో భాగమన్నారు. కుజదోషం పొగొట్టుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో అరటి చెట్టుతో పెళ్లి చేసి చెట్టును కొట్టేసే ఆచారం ఉందన్నారు. అరటి చెట్టులా తన కొడుకును పెళ్లి చేసుకుని హతమార్చిందని అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు దోపిడి దొంగల పనిగా నమ్మించేందుకు బంగారం ధరించాల్సిందిగా రఘువంశీపై సోనమ్ ఒత్తిడి తెచ్చిందన్నారు. తన సోదరుడు అమాయకుడంటోంది రాజ్ కుష్వాహా సోదరి సుహానీ. సోనమ్‌ను అక్కా అని పిలిచేవాడని.. రాజ్ తప్పు చేశాడని అందరూ అంటుంటే నమ్మశక్యంగా లేదన్నారు.
తమది ఏడు జన్మల బంధం
భర్తను హత్య చేయించిన సోనమ్.. అందర్నీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. రఘువంశీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి సాత్ జన్మోం కా సాథ్ హై అంటూ పోస్ట్ పెట్టింది. తమది ఏడు జన్మల బంధం అంటూ తన భర్త బతికే ఉన్నాడని నమ్మించింది. కానీ హనీమూన్ సమయంలో సోనమ్ ఒక్క ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని పోలీసులు గుర్తించారు. రఘువంశీ హత్య తర్వాత స్పాట్‌కి 10 కిలోమీటర్ల దూరంలో సోనమ్ ముగ్గురు వ్యక్తులతో మాట్లాడినట్టు పోలీసులు సీసీ టీవీలో గుర్తించారు. రఘువంశీ మర్డర్ కేసులో.. సోనమ్ సహా మిగతా నలుగురు నేరాన్ని అంగీకరించారు. రఘువంశీని చంపే క్రమంలో సోనమ్ స్పాట్‌లోనే ఉందని, రాజ్ కుష్వాహ మాత్రం ఇండోర్ ఉన్నాడని నిందితులు పోలీసులకు వివరించారు.
ప్రేమికుడు రాజ్‌ను మరచిపోలేకపోయిన సోనమ్
ఇదిలావుంటే, సోనమ్ రాజా రఘువంశీని వివాహం చేసుకున్నప్పటికీ, ఆమె అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడలేదు. సోనమ్ తన ప్రేమికుడు రాజ్‌ను మరచిపోలేకపోయింది. అందుకే రాజాను వదిలించుకోవడానికి ఆమె హత్య ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికను రూపొందించడంలో రాజ్ కూడా ఆమెకు మద్దతు ఇచ్చాడు. వివాహం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత, ఫ్లాన్‌లో భాగంగానే మే 20న, రాజా, సోనమ్ షిల్లాంగ్‌కు బయలుదేరారు. వారు మే 23న షిల్లాంగ్ చేరుకున్నారు మరియు అదే రోజున హంతకులు రాజాను చంపారు. హనీమూన్ ఎపిసోడ్‌లో విచారిస్తున్నా కొద్ది ఊహించని మలుపులు, కొత్త కోణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
Read Also: Honeymoon Murder: భర్త రాజా రఘువంశీని చంపినట్లు ఒప్పుకున్న సోనమ్