Punjab: కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య

Read Time:  1 min
Punjab
Punjab
FONT SIZE
GET APP

పంజాబ్‌లోని(Punjab) తరన్ తారన్ జిల్లా లా కాలేజ్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. క్లాస్‌రూమ్‌లో ఉన్న విద్యార్థుల ముందే ఓ యువకుడు లేడీ స్టూడెంట్‌పై కాల్పులు జరిపి ఆమెను హత్య చేసిన అనంతరం తనపై తానే కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు.

Read Also:AP: లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు

Punjab

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కాల్పుల దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. మృతదేహాలను (Punjab)పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతురాలి పేరు సందీప్ కౌర్ కాగా, ఆమెను కాల్చి ఆత్మహత్య చేసుకున్న యువకుడిని ప్రిన్స్ రాజ్‌గా గుర్తించారు. ఈ ఘటన వెనుక ప్రేమ సంబంధిత కారణాలు ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. 19 ఏళ్ల విద్యార్థి వద్ద తుపాకీ ఎలా వచ్చిందన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పంజాబ్‌లో ఆయుధ సంస్కృతి అంశంపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.