📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Patancheruvu: పటాన్‌చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి?

Author Icon By Anusha
Updated: June 30, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదం ప్రజలలో తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు (Patancheruvu) సమీపంలో ఉన్న పాశమైలారంలోని సిగాచి కెమికల్స్‌లో భారీ పేలుడు సంబంధించింది. రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు దాదాపు 100 మీటర్ల వరకు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు.ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 20మందికిపైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడినట్లు తెలుస్తోంది. పరిశ్రమలో మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన కార్మికుల్ని హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కంపెనీలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు తీవ్రతకు రియాక్టర్‌ (Reactor) ఉన్న భవనం కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో భవనానికి బీటలు వచ్చాయంటే ప్రమాద తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌ పరిశీలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. 

Patancheruvu

కంపెనీ దగ్గరకు

ఫ్యాక్టరీలో పేలుడు తర్వాత మంటలు చెలరేగగా కార్మికులు పరుగులు తీశారు. కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలియగానే కార్మికుల కుటుంబసభ్యులు ప్రమాదం జరిగిన కంపెనీ (Company) దగ్గరకు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా పఠాన్‌చెరు సమీపంలోని ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగాయి.పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Read Also: Swetcha: యాంకర్ స్వేచ్ఛతో సంబంధంపై లేఖ విడుదల చేసిన పూర్ణ చందర్

#ChemicalPlantFire #EmergencyResponse #FactoryAccidentIndia #FireAccidentHyderabad #HyderabadIndustrialAccident #IndustrialDisaster #PatancheruBlast #SangareddyExplosion #SigachiChemicalsBlast #WorkersSafety Ap News in Telugu Breaking News in Telugu chemical factory blast Telangana chemical reactor explosion Google News in Telugu Hyderabad factory explosion Hyderabad fire news industrial safety India Latest News in Telugu Paper Telugu News Patancheru industrial accident Sangareddy chemical plant fire Sigachi Chemicals blast Telangana fire incident Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news workers injured in blast

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.