हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

మహిళా అధికారి చేతిలో మోసపోయి ఆత్మహత్య కు పాల్పడ్డ వ్యక్తి

Anusha
మహిళా అధికారి చేతిలో మోసపోయి ఆత్మహత్య కు పాల్పడ్డ వ్యక్తి

కర్ణాటకలోని మంగళూరులో హోటల్ గదిలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అభిషేక్ సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. అతడు మరణానికి ముందు 20 నిమిషాలపాటు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఈ ఘటనను మరింత చర్చనీయాంశంగా మారుస్తోంది. చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అభిషేక్, మంగళూరులో జరిగిన ఓ ఎగ్జిబిషన్ కోసం తన సహచరులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అయితే, మంగళవారం అతడు రావ్ అండ్ రావ్ సర్కిల్‌లో ఉన్న ఓ హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్నాడు.

పెళ్ళికి నిరాకరణ

అభిషేక్ సింగ్ తన మరణానికి కారణంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) మహిళా అధికారి మోనికా సిహాగ్‌ను పేర్కొన్నాడు. ఆమె తనను మోసగించిందని, పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి ప్రేమ నటించి తనను లోబరచుకుందని ఆరోపించాడు. తన వద్ద నుంచి రూ. 8 లక్షల విలువైన బంగారం తీసుకుందని, తనను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దోచుకుందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అంతేకాదు, మోనికకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయం తనకు ఇటీవలే తెలిసిందని, తాను దీనిపై ప్రశ్నించగా ఆమె పెళ్లికి నిరాకరించిందని తెలిపాడు.

తీవ్ర ఆవేదన

అభిషేక్ సింగ్ మరణానికి సంబంధించి అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అతని తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళూరులోని పండేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తన సోదరుడి నుంచి మొత్తం రూ. 15 లక్షలు లాగేసుకుందని అభిషేక్ సోదరుడు పోలీసులకు తెలిపాడు. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.

40 year old man commits suicide in mangaluru accuses cisf woman officer of deception exploitation in video 1741056372470 16 9

కేసు నమోదు

ఆమెకు చాలా మందితో శారీరక సంబంధాలు ఉన్నాయని అభిషేక్ ఆరోపించడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన స్థానిక పోలీసులుమరణం వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు. అభిషేక్ సోదరుడు ఫిర్యాదు ఆధారంగా పండేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయినట్టు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. తన సోదరుడు మార్చి 1 ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఫోన్ చేసి మోనిక తనను పెళ్లి చేసుకోడానికి నిరాకరిస్తోందని, ఇప్పటికే ఆమె పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని తెలిసిందని చెప్పినట్టు అభిషేక్ తమ్ముడు పేర్కొన్నారు. తన సోదరుడి దగ్గర నుంచి దాదాపు 15 లక్షలు రూపాయాల వరకూ లాగేసుకుందన్నాడు.

ఈ ఆరోపణలపై సీఐఎస్ఎఫ్ అధికారిణి మాత్రం ఇంకా స్పందించలేదు. అలాగే, సీఐఎస్ఎఫ్ సైతం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉన్నతాధికారిణిపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870