ఒడిశాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గోపాల్‌పూర్ బీచ్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ కాలేజ్ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి సముద్రతీరానికి వెళ్లిన సమయంలో 10 మంది దుండగుల గుంపు విద్యార్థినిపై దాడికి పాల్పడి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. అత్యంత హేయంగా ఆమె స్నేహితుడిని కొట్టి ఒకచోట బంధించి ఉంచి, యువతిపై అమానుషంగా అఘాయిత్యానికి ఒడిగట్టిన దుండగుల తీరు మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది.ఈ ఘటనపై పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేయగా, వారు వెంటనే కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
పూర్తి వివరాలు
బాధిత యువతి తన మిత్రుడితో కలిసి ఆదివారం రాత్రి గోపాల్‌పూర్ బీచ్‌కి వెళ్లింది. ఈ సమయంలో అక్కడకు వచ్చిన 10 మంది వ్యక్తుల గుంపు వారిపై దాడి చేశారు.అనంతరం ఆ యువకుడ్ని తాడుతో కట్టేసి, అతడి కళ్లముందే ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు గోపాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ (Gopalpur Police Station) లో ఫిర్యాదు చేయడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుచేసిన పోలీసులు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఒడిశాలోని అతి ప్రముఖ బీచ్ రిసార్ట్ ప్రాంతాలలో గోపాల్‌పూర్ ఒకటి. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.
క్రిమినల్ రికార్డు
గోపాల్‌పూర్ బీచ్ వద్ద కాలేజ్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో అనుమానితులను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు బెరహంపూర్ ఎస్పీ శరవణ్ వివేక్ తెలిపారు.ముగ్గురు అనుమానితులు పరారీలో ఉన్నారని, వారి కోసం పలు ప్రాంతాల్లో గాలింపు జరుపుతున్నట్లు చెప్పారు. వారికి క్రిమినల్ రికార్డు ఉందా లేదా అన్నదాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.గత వారం పూరీ బీచ్ రిసార్ట్‌లో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వారం వ్యవధిలోనే ఒడిశా బీచ్‌లో జరిగిన రెండో ఘటన కావడం కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బాధితురాలిని ఆమె స్నేహితుడు పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చాడు. అత్యాచారానికి పాల్పడిన దుండగులు మద్యం సేవించి ఉన్నారని తెలిపాడు.
వైద్య పరీక్షలు
వారు నీచమైన కామెంట్లు చేయడంతో ఆమె స్నేహితుడు అభ్యంతరం తెలిపాడు. ఆపై యువకుడిపై దాడి చేసి, అతడ్ని బంధించారు. యువతిపై ఒక్కొక్కరుగా పలుసార్లు అత్యాచారం చేశారు. కాగా, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. షాక్‌లో ఉన్న ఆమెకు కౌన్సెలింగ్ (Counselling) అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానికులు, పర్యాటక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీచ్‌లో భద్రతపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
కఠిన చర్యలు
బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసంఘాలు నినదిస్తున్నాయి.ఈ కేసులో నిందితులను పట్టుకుని, వేగంగా విచారణ జరిపి, కఠిన శిక్షలు విధించినప్పుడే న్యాయం (Justice) జరుగుతుందననిపిస్తుంది. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా సమాజం చైతన్యంతో ముందుకు సాగాలి.
Read Also: Vijayawada: ఏపీలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు