సికింద్రాబాద్‌లోని బోయినపల్లి వద్ద ట్రాఫిక్ ఎస్సైతో షోయబ్ అనే వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు షోయబ్ వాహనాన్ని ఆపారు. దీంతో ఆగ్రహించిన షోయబ్ నా వాహనాన్నే ఆపుతారా అంటూ పోలీసులపై దాడికి ప్రయత్నించాడు.పూర్తీ వివరాలు.సికింద్రాబాద్ బోయినపల్లిలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో బాపూజీ నగర్ నుంచి బోయినపల్లి క్రాస్ రోడ్ వైపుకు బుల్లెట్ వాహనంపై వెళ్తున్న షోయబ్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు అడిగారు. అనంతరం బైక్‌కు ఫోకస్ లైట్లు ఉన్నాయని ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన షోయబ్ తన వాహనాన్ని ఆపుతారా, బండిపై చేయి తీయి అంటూ పోలీసులపై దుర్భాషలాడాడని ఎస్సై విజయ్ కాంత్ తెలిపారు. వెంటనే పోలీసులు అతన్ని వారించే ప్రయత్నం చేసినప్పటికీ షోయబ్ ఇష్టారీతిగా వ్యవహరించి తమపై దాడి చేసేందుకు ప్రయత్నించాడిని ఎస్సై అన్నారు.అయితే ట్రాఫిక్ పోలీసులే తనపై దాడి చేశారని షోయబ్ ఆరోపించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. బోయినపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనస్థలికి చేరుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.తనిఖీల్లో భాగంగా వాహనాన్ని ఆపాం. బైక్‌కు ఫోకస్ లైట్లు ఉన్నాయని ప్రశ్నించాం. దానికి తన బండిపై చేయి తీయాలని వాదిస్తూ దుర్భాషలాడాడు. పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడని తెలిపారువిజయ్ కాంత్.
ఎస్ఐపై బెదిరింపులు
ఇటీవల ట్రాఫిక్ పోలీసులు పై దాడులు ఎక్కువవుతున్నాయి.హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ సమయంలో తాజ్‌కృష్ణ హోటల్ నుంచి కేసీపీ మార్గం వైపు ఓ థార్ వాహనం వస్తోంది. ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహన యజమాని అప్రజ్ ట్రాఫిక్ ఎస్ఐ మోజిరామ్పై రంకెలేశాడు. ‘నా వాహనాన్నే ఆపుతావా నీకు ఎంత ధైర్యం. నిన్ను నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయిస్తా’ అంటూ ట్రాఫిక్ ఎస్ఐపై బెదిరింపులకు పాల్పడ్డాడు.హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తాజ్‌కృష్ణ హోటల్ నుంచి కేసీపీ మార్గం వైపు ఓ థార్ వాహనం వస్తోంది. ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహన యజమాని అప్రజ్ ట్రాఫిక్ ఎస్ఐ మోజిరామ్పై రంకెలేశాడు. ‘నా వాహనాన్నే ఆపుతావా నీకు ఎంత ధైర్యం. నిన్ను నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయిస్తా’ అంటూ ట్రాఫిక్ ఎస్ఐపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ ఆకతాయి బెదిరింపులకు లొంగని ట్రాఫిక్ ఎస్ఐ ఆ వాహనంపై ఉన్న చలాన్లను పరిశీలించాడు. అతడి వాహనంపై రూ.4వేలు పెండింగ్ చలాన్లు ఉన్నట్లుగా పోలీసుల పరిశీలనలో తేలింది. ఆ వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. దీంతో పెండింగ్ చలానా రూ.4వేలతో పాటు ఫైన్ మరో రూ.1000 చెల్లించాల్సి వచ్చింది.