Medak Crime News: భార్యను గొంతు కోసి చంపి భర్త పరార్

Read Time:  1 min
Medak Crime News: భార్యను గొంతు కోసి చంపి భర్త పరార్
FONT SIZE
GET APP

పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు

Medak Crime News: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో భార్య గొంతు కోసి చంపి భర్త పరారైన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో వెంకటేశ్వర టెంపుల్ ట్యాంకు సమీపంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వరలక్ష్మి,ఆమె భర్త త్రిమూర్తి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.వివాదం కాస్త తీవ్రరూపం దాల్చడంతో ఆవేశానికి లోనైన త్రిమూర్తి కత్తితో భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.

Read Also: Jharsuguda Road Accident: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు దుర్మరణం

Medak Crime News: Husband strangles wife to death, absconds
Medak Crime News: Husband strangles wife to death, absconds

కేసు నమోదు

స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇంట్లో ఉన్న బంగారు నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.