📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Manipur: మైతీ తెగ నాయకుల అరెస్ట్‌తో మళ్ళీ రగిలిన మణిపూర్‌

Author Icon By Ramya
Updated: June 9, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Manipur లో మళ్లీ అగ్నిగుండం: మైతీ నాయకుల అరెస్టుతో భగ్గుమన్న హింస

గత కొన్ని రోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న Manipur రాష్ట్రం మళ్లీ అగ్నిగుండంగా మారింది. గత సంవత్సరం చెలరేగిన జాతుల మధ్య రగిలిన ఘర్షణలు, హింసాయుత ఘటనల నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోకముందే, తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు Manipurను మరోసారి హింసాత్మక వాతావరణంలోకి నెట్టాయి. మైతీ తెగకు చెందిన నాయకుల అరెస్టుతో రాజధాని ఇంఫాల్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. అరెస్టులకు వ్యతిరేకంగా మైతేయ్ సముదాయం పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది, ఇది త్వరగా ఉద్రిక్తంగా మారి, శాంతిభద్రతలకు సవాలుగా మారింది. మైతీ తెగకు చెందిన రాడికల్ గ్రూప్ ‘అరమ్‌బాయ్ తెన్గోల్’ (AT) ప్రముఖ నాయకుడు కనన్ సింగ్ సహా ఐదుగురు నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో ఇంఫాల్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. మైతీ తెగ యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పలు ప్రాంతాల్లో టైర్లను తగులబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. నిరసనకారులు తమ నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనకారుల ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందంటే, కొందరు యువకులు తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ పెట్రోల్ పోసుకుని బెదిరింపులకు దిగారు. ఈ ఆందోళనల్లో వాహనాలు ధ్వంసం అయ్యాయి, పలు చోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఇది మణిపూర్ రాజకీయ, సామాజిక వాతావరణంలో నెలకొన్న సున్నితత్వాన్ని మరోసారి రుజువు చేసింది.

Manipur Violence

కనన్ సింగ్ అరెస్టు, దాని పరిణామాలు

2024 ఫిబ్రవరిలో పోలీస్ సూపరింటెండెంట్ మోయిరంగ్థెం అమిత్ ఇంటిపై దాడి, ఒక సీనియర్ పోలీస్ అధికారి కిడ్నాప్‌లో కనన్ సింగ్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఆ సమయంలో కనన్ సింగ్ రాష్ట్ర పోలీస్ కమాండో యూనిట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా అప్పట్లో కనన్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కనన్ సింగ్ ఏటీలో నాయకుడిగా మారారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలతో ఆందోళనకారులు ఘర్షణ పడ్డారు. ఖురాయ్ లామ్‌లాండ్ జిల్లాలో ఆందోళనకారులు ఓ బస్సును తగులబెట్టారు. క్వాకెయితెల్ ప్రాంతంలో కాల్పులు శబ్దం విన్పించింది. అయితే కాల్పులు ఎవరు జరిపారన్నది వెల్లడికాలేదు. అరెస్టయిన తమ నాయకుడిని రాష్ట్రం బయటకు తీసుకుపోతున్నారని భావించి ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌పై పడుకుని బ్లాక్ చేశారు. ఆందోళనకారులపై భద్రతా దళాలు టియర్ గ్లాస్ షెల్ ప్రయోగించాయి. లాఠీ చార్జీలో ఒకరు చనిపోయారు.

ప్రభుత్వ చర్యలు, రాష్ట్రంలో కర్ఫ్యూ

మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తొబల్, కాక్చింగ్ జిల్లాల్లో 144 సెక్షన్ విధించి అదనపు బలగాలను మోహరించారు. ఆందోళనల నేపథ్యంలో ఈ ఐదు జిల్లాల్లో ఐదురోజులపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందిప్రభుత్వం. మరోవైపు 10రోజుల పాటు బంద్ పాటించాలని అరమ్‌బాయ్‌ తెన్గోల్‌-AT గ్రూప్ పిలుపునిచ్చింది.

2023 మే నుంచి మణిపూర్‌లో మైతీలు, ‘కుకి-జో’ తెగల మధ్య చోటుచేసుకున్న హింసాయుత ఘటనల్లో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు సంబంధించి కేసులో అరమ్‌బాయ్‌ తెన్గోల్‌-ATకి చెందిన నేతలను అరెస్ట్ చేయడంతో మళ్లీ రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లింది. అరమ్‌బాయ్‌ తెన్గోల్‌-AT గ్రూప్ మైతీ సంస్కతి పరిరక్షణకోసం ఏర్పాటై అనంతరం రాడికల్‌ గ్రూప్‌గా మారింది. ఇటీవల ఈ గ్రూప్‌ గవర్నర్‌తో చర్చలు జరిపింది. కొంతమంది గ్రూప్ సభ్యులు ఆయుధాలు వీడి సరెండర్ అయ్యారు.

ప్రియాంక గాంధీ స్పందన: కేంద్రంపై విమర్శలు

మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. రాష్ట్రం రెండేళ్లుగా హింసాయుతమైంది. ప్రజలు హింస, హత్య, అత్యాచారాలకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. హింసాయుత ఘటనల్లో వందలాది చనిపోగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రపతి పాలన సాగిస్తున్నప్పటికీ, మణిపూర్ లో శాంతి పునరుద్ధరించబడకపోవడానికి కారణం ఏమిటి? ప్రధాని మోదీ మణిపూర్‌ను ఎందుకు వెళ్లలేదు? దేశ ప్రజలకు శాంతి భద్రతలను నిర్ధారించడం ప్రధానమంత్రి బాధ్యత. దీని నుండి వెనక్కి తగ్గడం అంటే బాధ్యత నుండి తప్పుకోవడమే అని ట్వీట్ చేశారు.

Read also: Raja’s murder: నిరంతర దర్యాప్తు తోనే కేసుకు ఛేదించగలిగాం: మేఘాలయ పోలీసులు

#AramBaiTengol #Imphal #InternetShutdown #KananSinghArrest #KukiJo #LawandSecurity #MaitiTega #ManipurRiots #President'sRule #telugu News #ViolentIncidents Ap News in Telugu Breaking News in Telugu Curfew Google News in Telugu Latest News in Telugu Manipur ManipurViolence Paper Telugu News PriyankaGandhi Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.