📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Crime News: ప్రేమను తిరస్కరించిందని ఐదో అంతస్తు నుంచి యువతిని తోసేసిన ఉన్మాది

Author Icon By Vanipushpa
Updated: June 25, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రేమ నిరాకరణతో ఉన్మాదిగా మారిన యువకుడు.. ఐదో అంతస్తు నుంచి యువతని తోసేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు విడిచింది. ఈశాన్య ఢిల్లీ(Delhi) లోని జ్యోతినగర్‌(Jyothinagar)లో జరిగన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. సోమవారం(జూన్ 23) రాత్రి ఉత్తరప్రదేశ్‌(Uttara Pradesh) లోని రాంపూర్(Rampur) జిల్లాలోని టాండా నుండి పట్టుబడ్డాడు. తౌఫిక్‌.. నేహాతో రోజూ మాట్లాడేవాడు. సోదరుడిగా భావించి ఆమె కూడా మాట్లాడుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత తౌఫిక్ వికృత స్వరూపాన్ని బయటపెట్టాడు. ప్రేమ పెళ్లి అంటూ వేధించాడు. భరించలేక తౌఫిక్‌ను దూరం పెట్టింది నేహా. తిరస్కారాన్ని తట్టుకోలేక అవమానంతో రగిలిపోయాడు తౌఫిక్‌. తనకు తప్ప మరెవ్వరికీ దక్కకూడదని భావించి చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

Love: ప్రేమను తిరస్కరించిందని ఐదో అంతస్తు నుంచి యువతిని తోసేసిన ఉన్మాది

బుర్ఖా ధరించి వెళ్లిన నిందితుడు
నేహా ఇంట్లోకి దొంగచాటుగా వెళ్లాడు తౌఫిక్‌. బుర్ఖా ధరించి వెళ్లిన అతన్ని తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. చాకచక్యంగా అతన్ని పక్కకు నెట్టి.. నేహా రూమ్‌లో వెళ్లాడు. పెళ్లి విషయమై మరోసారి నిలదీశాడు. అందుకు నేహా నిరాకరించడంతో.. ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. అంత దూరం నుంచి కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్తానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి నేహా చనిపోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తౌఫిక్ ఢిల్లీలోని మండోలి రోడ్డులో పనిచేశాడు. దారుణానికి ఒడిగట్టిన అనంతరం పారిపోయిన తర్వాత, రాంపూర్‌లో పోలీసు బృందాలు అర్థరాత్రి నిర్వహించిన ఆపరేషన్‌లో అతన్ని ట్రాక్ చేసి అరెస్టు చేశాయి.
మైనర్‌ బాలికపై లైంగిక దాడి
మరోవైపు ఈశాన్య ఢిల్లీలోని ఖజురి ఖాస్ ఏరియాలో బాలికకు వేధింపుల ఘటన అక్కడున్న వాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఓ యువకుడు మైనర్‌పై లైంగిక దాడి చేశాడు. చేయి పట్టుకుని వదలకుండా ఎక్కడెక్కడో టచ్ చేశాడు. ఆమె వదిలించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా ఆ దుర్మార్గుడు వదల్లేదు. అటూ ఇటూ తిప్పుతూ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. ఇది గమనించిన మరో యువకుడు అతన్ని వారించాడు. మధ్యలో నువ్వెవరంటూ కత్తితో దాడికి దిగాడు.
పోలీసుల అదుపులో యువకుడు
స్థానికులిచ్చిన సమాచారంతో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు.. దాడి చేసిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని చమన్‌గా గుర్తించారు. బాలికకు వేధింపులు.. కత్తితో దాడి.. రెండు వేర్వేరు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందరూ మైనర్లే కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక చమన్‌ బ్యాగ్రౌండ్‌ ఏంటి..? గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.

Read Also: Hyd Crime: 24 గంటల్లో కేసు ఛేదించిన జీడిమెట్ల పోలీసులు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu fifth floor from Google News in Telugu Latest News in Telugu love man Paper Telugu News pushes rejection Telugu News online Telugu News Paper Telugu News Today Women

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.