📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Maharashtra: మహిళా రోగిపై ఓ వైద్యుడి అమానుషం

Author Icon By Anusha
Updated: May 29, 2025 • 6:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర ఆసుపత్రిలో పడకల కొరత కారణంగా, ఓ మహిళా కొవిడ్ రోగిని చంపేయాలంటూ ఓ సీనియర్ వైద్యుడు మరో వైద్యుడికి ఫోన్‌లో సూచించినట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పూర్తి వివరాలు

వివరాల్లోకి వెళితే, 2021లో కరోనా వైరస్ రెండో దశ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా(Latur district) ఉద్గిర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌లో రోగులతో కిక్కిరిసిపోయింది. ఆక్సిజన్, బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తున్న రోజులవి.ఆ సమయంలో జిల్లా అదనపు సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ శశికాంత్ దేశ్‌పాండే, అదే ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న మరో వైద్యుడు డాక్టర్ శశికాంత్ డాంగే(Shashikant Dange)కు ఫోన్ చేశారు.దాదాపు పది రోజులుగా చికిత్స పొందుతున్న ఒక మహిళా రోగి గురించి ప్రస్తావిస్తూ, ఆమెను చంపేయాలని డాక్టర్ దేశ్‌పాండే సూచించినట్లు తెలుస్తోంది. దీనికి స్పందించిన డాక్టర్ డాంగే, సదరు రోగికి ఆక్సిజన్ సరఫరా ఇప్పటికే తగ్గించామని చెప్పడం గమనార్హం.ఈ సంభాషణ జరిగినప్పుడు డాక్టర్ డాంగే లౌడ్ స్పీకర్ ఆన్ చేసి, బాధిత మహిళ భర్త పక్కనే కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆసుపత్రిలో పరిస్థితిని వివరిస్తున్న డాంగేకు, ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయని దేశ్‌పాండే అడిగారు. ప్రస్తుతం ఏమీ లేవని డాంగే సమాధానమిచ్చారు. అప్పుడు, ఒక మహిళా రోగి పేరు చెప్పిన దేశ్‌పాండే, “ఆమెను చంపెయ్ నీకు ఇది అలవాటే కదా” అంటూ దారుణ వ్యాఖ్యలు చేసినట్లు బాధితురాలి భర్త స్వయంగా విన్నారు. ఆ సమయంలో తన భార్యకు చికిత్స అందుతుండటంతో, భవిష్యత్తు పరిణామాలకు భయపడి ఆయన మౌనంగా ఉండిపోయారు. కొద్దిరోజుల తర్వాత ఆమె కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు.

Maharashtra:

ఆధారంగా

ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో(Social media) వైరల్‌గా మారింది. ఇది బాధిత మహిళ, ఆమె కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా డాక్టర్ శశికాంత్ దేశ్‌పాండేపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆయన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మరో వైద్యుడు డాక్టర్ శశికాంత్ డాంగేకు కూడా నోటీసులు జారీ చేశామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Read Also: Karnataka: గ్యారెంటీ స్కీమ్‌లపై లబ్ధిదారుల జాబితాను సమీక్షించాలని యోచన

#COVIDScandal #HospitalNegligence #JusticeForPatients #MaharashtraShocker #MedicalEthics Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.