📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Madrasa Teacher: మదరసా టీచర్‌ ఘాతుకం: మూడేళ్లుగా యువతిని బంధించి లైంగిక దాడులు

Author Icon By Vanipushpa
Updated: July 5, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌(Uttara Pradesh)లోని మీరట్‌(Meerut)లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మదరసా టీచర్, బంధువైన విద్యార్థినిని మూడేళ్లుగా గృహ నిర్బంధం(House Arrest)లో ఉంచి, చిత్రహింసలకు గురిచేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యంలో బాధితురాలు మూడుసార్లు గర్భం దాల్చగా, నిందితుడు తన భార్యతో కలిసి బలవంతంగా అబార్షన్లు చేయించాడు. ఈ అమానవీయ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన టీచర్‌ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, బీహార్‌కు చెందిన 22 ఏళ్ల యువతిని ఐదేళ్ల క్రితం ఆమె బంధువైన 45 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మీరట్‌కు తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను ఓ స్థానిక మదరసాలో చేర్పించి, తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. గత మూడేళ్లుగా ఆమెను బయటకు వెళ్లకుండా నిర్బంధించి, చిత్రహింసలు పెడుతూ లైంగికంగా వేధించాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తే, ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని ఇరుగుపొరుగు వారిని నమ్మించేవాడు.

Madrasa Teacher: మదరసా టీచర్‌ ఘాతుకం: మూడేళ్లుగా యువతిని బంధించి లైంగిక దాడులు

అరుపుల వెంటనే చర్య – స్థానికుల సహకారంతో పోలీసులు రంగంలోకి
జూన్ 9న ఇంటికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఆమెను తిరిగి గదిలో బంధించారు. తీవ్రంగా కొట్టినపుడు బాధితురాలు అరవగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను బయటికి రక్షించారు. జూన్ 9న బాధితురాలు ఇంటికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఈ విషయం తెలుసుకున్న నిందిత దంపతులు ఆమెను మళ్లీ గదిలో బంధించారు. గురువారం మరోసారి ఆమెను తీవ్రంగా కొట్టడంతో, బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం బయటపడింది.

కేసు నమోదు – టీచర్ అరెస్ట్, భార్య పరారీలో

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడైన టీచర్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద అత్యాచారం కేసు, అతడి భార్యపై నేరపూరిత కుట్ర కేసు నమోదు చేశారు. ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, “యువతి చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. నిందితుడైన టీచర్‌ను అరెస్ట్ చేశాం. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం,” అని తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి భార్య కోసం గాలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Pune: పూణే అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్..

#telugu News abuse by teacher India Ap News in Telugu Breaking News in Telugu forced abortion case girl held captive 3 years Google News in Telugu human rights violation Meerut Indian crime against women Latest News in Telugu madrasa abuse incident Madrasa teacher rape Meerut crime news Paper Telugu News shocking crime India teacher arrested rape case Telugu News online Telugu News Paper Telugu News Today Uttar Pradesh rape case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.