📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

లాలూ కొడుకు, కుమార్తె లకు బెయిల్

Author Icon By Vanipushpa
Updated: March 11, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమ యాదవ్‌, తదితరులకు రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారంనాడు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో సమన్లు జారీ కావడంతో తేజ్ ప్రతాప్, హేమ యాదవ్ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వీరికి కోర్టు రూ.50,000 పూచీకత్తు, అంతే మొత్తానికి ష్యూరిటీతో కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇదే కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, మిసాభారతి హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వీరు దరఖాస్తు చేసుకున్నారు.

77 మందిని నిందితులుగా

ఈ కేసులో తుది ఛార్జిషీట్లుతో సహా మూడు చార్జిషీట్లను సీబీఐ దాఖలుచేసింది. ఇందులో లాలూ ప్రసాద్, మరో 77 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ ఛార్జిషీట్లను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గాగ్నో.. తేజ్ ప్రతాప్, హేమయాదవ్ తదితరులకు బెయిలు మంజూరు చేస్తూ, తదుపరి విచారణను మార్చ 20వ తేదీకి వాయిదా వేశారు.

మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు

ఈ కేసు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న 2004 నుంచి 2009 మధ్య కాలానికి సంబంధించినది. ఆయన హయాంలో నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే గ్రూప్ డీ పోస్టుల్లో కొందరికి ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిగా లాలూ కుటుంబ సభ్యులు, ఇతర అనుచరుల పేరిట భూములను రిజిస్టర్ చేయించున్నారని సమాచారం. ఈ కేసులో క్రిమినల్ కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీంతో ఈ రెండు దర్యాప్తు సంస్థలు లాలూ కుటుంబ సభ్యులను పలుమార్లు విచారించాయి.

#telugu News Ap News in Telugu Bihar Breaking News in Telugu Google News in Telugu india Lalu's son and daughter get bail Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.