ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంట(Kunta) పొలీస్ స్టేషన్ పరిధిలో గస్తీలో ఉన్న పొలీసుల వాహనాన్ని లక్షంగా చేసుకొని మావోయిస్టు(maoist)లు ఐఈడి పేల్చారు.ఈ ఘటనలో కొంట ఏఎస్పీ ఆకాష్ రావు గిర్పుంజే తీవ్రంగా గాయపడ్డారు.సంఘటన తర్వాత అతన్ని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు, చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
ఆకాశ్‌రావు గిర్పుంజే మరణంతో మొత్తం పోలీసు శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ పేలుడులో కొంటా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ (టిఐ) ఎస్‌డిపిఓ లు కూడా గాయపడ్డారు.వీరిని సైతం వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.సంఘటన అనంతరం ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకొని పరిశర ప్రాంతాలలో సెర్చ్ అపరేషన్ చేపట్టారు.
Read also: Wellness Places: వరల్డ్ టాప్ 5 వెల్నెస్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవంటే?