📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Kunal Kamra: కునాల్ కామ్ర ముందస్తు బెయిలు పొడిగింపు

Author Icon By Vanipushpa
Updated: April 7, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రకు తాత్కాలిక ఊరట లభించింది. ఆయనకు ఇటీవల మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిలును మద్రాసు హైకోర్టు సోమవారంనాడు పొడిగించింది. ఏప్రిల్ 17వ తేదీ వరకూ ఈ గడువును పొడిగించింది.
మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కునాల్ కామ్ర
కునాల్ కామ్ర వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయన ఇటీవల మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయనకు తాత్కాలిక ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఆ గడువు సోమవారంతో ముగియనుండటంతో ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తన వాదన వినిపించారు. కునాల్‌పై మహారాష్ట్రలో మరో 3 కేసులు నమోదైనట్టు తెలియజేశారు. ముంబై పోలీసులు కునాల్‌ పట్ల శతృత్వంతో వ్యవహరిస్తున్నారని, ఆయన తల్లిదండ్రులను కూడా వేధిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కాగా, మహారాష్ట్ర పోలీసులు తనకు వ్యతిరేకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాల్సిం దిగా ముంబై హైకోర్టును కూడా కునాల్ ఆశ్రయించారు. జస్టిస్ సారంగ్ కొత్వాల్‌ సారథ్యంలోని ధర్మాసనం ఏప్రిల్ 8న ఈ కేసు విచారణను చేపట్టనుంది.

అసలు ఇదీ వివాదం
ముంబైలో ఇటీవల జరిగిన కామెడీ షోలో ఏక్‌నాథ్ షిండేను ప్రస్తావిస్తూ కునాల్ ఒక పేరడీ సాంగ్‌ ప్రదర్శించారు. శివసేనను చీల్చడంలో షిండే పాత్రను ప్రస్తావిస్తూ ‘ద్రోహి’గా ఆయనను అభివర్ణించారు. యూట్యూబ్‌లో ఇందుకు సంబంధించిన వీడియో అప్‌లోడ్ కావడంతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ పాటను రికార్డింగ్ చేసిన స్టూడియోను ధ్వంసం చేశారు. కునాల్‌పై శివసేన ఎమ్మెల్యే మురాజీ పటేల్ ఫిర్యాదు చేయడంతో మార్చి 24న ఎఫ్ఐఆర్ నమోదైంది. అ తర్వాత మరో మూడు ఎఫ్ఐఆర్‌లు కునాల్‌పై నమోదయ్యాయి. ఈ కేసులో విచారణాధికారి ముందు హాజరుకావాలంటూ కునాల్‌కు ముంబై పోలీసులు మూడుసార్లు సమన్లు జారీ చేశారు. అయితే కునాల్ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

#telugu News anticipatory bail extended Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Kunal Kamra's Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.