హైదరాబాద్ : వీకెండ్ వచ్చిందంటే చాలు.. సర్వీస్ అపార్టుమెంట్లో మద్యం విందులు. డ్రగ్స్ వినియోగాలు అమ్మాయిలు.. దాన్నులు.. రేవు పార్జీలు (Rave party).. ఇలా ఒకటేమిటి కొండాపూర్ ఏరియాలో జరుగుతున్న చిత్రవిచిత్రాలు ఇవి.. వివరాల్లోకి వెళ్తే, కొండాపూర్ ఎస్వీ నిలయం అనే సర్వీస్ ఆపార్ట్మెంట్లో ఏపీకి చెందిన కొన్ని ముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భం గా హైదరాబాద్ కు తీసుకువచ్చి హైదరాబాద్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి రేవ్ పార్టీని శనివారం రాత్రి స్టేట్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బీ టీం ఎస్పై సంధ్య బాలరాజు ఇతర సిబ్బంది. కలిసి దాడి చేసి పట్టుకున్నారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా మారుపేరులతో మారు బ్యాంక్ అకౌంట్లో మారు ఆధార్ కార్డులతో డబ్బున్న సరాబులను తీసుకు వచ్చి రెండు రోజులపాటు ఎంజాయ్ చేయించి తీసుకు వెళుతుంటారు.

రేవ్ పార్టీ ముఠాపై ఎక్సైజ్ బీ టీం దాడి – తొమ్మిది మంది అరెస్ట్, ముగ్గురు పరారీలో
ఇలాంటి ముఠా ను ఎస్టిఎఫ్ బి టీం (STFB Team) పట్టుకున్నారు. వీరందరినీ శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో (Sherlingampalli Excise Station) అప్పగించినట్లు సీఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2.080 గ్రాములు గంజాయిని, 11.57 గ్రాముల మ్యాజిక్ ముమ్రామ్ ను. 1.91 గ్రాముల రెరస్ డ్రగ్స్, నాలుగు కార్లను 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని 9 మందిని అరెస్ట్ చేశారు. ఆరెస్ట్ అయిన వారిలో కింగ్కెన్ షేర్ రాహుల్ డ్రగ్స్ తెప్పించే వ్యక్తి ఆర్గనైజర్లు ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే అప్పికోట్ల అశోక కుమార్, సమ్మెల సాయి కృష్ణ హిట్ జోసఫ్ తోట కుమారస్వామి అడపా యశ్వంత్ శ్రీదత్, నంద సమతా తేజలను అరెస్ట్ చేశారు. వీరితోపాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు వేయగా వారు పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు.
ఏపీకి చెందిన వాహనాలపై ఆరా తీస్తున్న అధికారులు
రేవ్ పార్టీలో (Rave party) పట్టుడిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాహనాలపై ముఖ్యంగా కార్లపై అధికారులు ఆ తీస్తున్నారు. టోయోటా ఫార్చ్యూనర్ కార్, ఫోర్ట్ కార్ ల ఆధారంగా అధికారులు ఆయా వానాలను ఎవరి పేరు మీద ఉన్నాయనే కోణంలో దర్యా పు చేస్తున్నారు. ముఖ్యంగా టయోటా ఫార్చ్యూనర్ కార్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వాహానం ఏపికి చెందిన ఒక ప్రముఖ ప్రజా ప్రతినిధికి చెందిన కారు అని ప్రచారం జరుగుతుండటంతో అధికారులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తు న్నారు. సాధారణంగా ఇటువంట ఫ్యాన్సీ నంబర్లను ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారస్తులు, సినిమా రంగాలకు చెందిన వారే ఉపయోగించడం గమనార్హం.
రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది?
రేవ్స్ లేదా రేవ్ పార్టీలు అనేవి అత్యంత వేగవంతమైన డ్యాన్స్ పార్టీలు, ఇవి పార్టీకి వెళ్లేవారిలో ఉత్సాహభరితమైన వైబ్‌ను సృష్టించడానికి పునరావృతమయ్యే ఎలక్ట్రానిక్ సంగీతాన్ని లైట్ షోలతో కలిపి ఉంటాయి . రేవర్ అంటే రేవ్ పార్టీలకు హాజరయ్యే వ్యక్తి.
రేవ్ పార్టీ ఎలా ఉంటుంది?
నేటి రేవ్ నేపథ్య పార్టీలు అంత రహస్యంగా ఉండవు మరియు అంతే ప్రకాశవంతంగా ఉంటాయి కానీ అన్ని అక్రమ కార్యకలాపాలు ఉండవు. వాటిలో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM), లేట్-నైట్ బీట్స్, ట్రిప్పీ లైట్ షోలు మరియు ఆకర్షణీయమైన నియాన్ ఫ్యాషన్ ఉంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Anil Kumar: సినీ కార్మికులకే చిత్రపురి కాలనీ