📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Kolkata: కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: June 28, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోల్‌కతాలో మరో దారుణం వెలుగు చూసింది. గతేడాది ఆర్‌జి కార్ మెడికల్ కాలేజీలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది కూడా కాలేదు. తాజా మరోసారి కోల్‌కతాలోని ఒక విద్యా సంస్థలో ఒక విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఒక లా కాలేజీ (Law College) లో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది.ముఖ్యంగా లా కాలేజీలోనే ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా మిగతా ఇద్దరు ప్రస్తుత విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

సామూహిక అత్యాచారం

ఈ సామూహిక అత్యాచార ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో బాధితురాలినే నిందించేలా ఎంపీ మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు ఎవరితో స్నేహం చేస్తున్నారనే విషయంలో, ముఖ్యంగా చెడు మనస్తత్వం ఉన్న పురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన చేసిన సూచన వివాదాస్పదమైంది. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం (Gang rape) ఘటనపై కల్యాణ్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, “అత్యాచారం చేసింది ఆమె సొంత స్నేహితులే కదా. క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించలేరు. అలాంటప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ఆమె స్నేహితులే.

Kolkata:

మహిళా సంఘాలు

కాపాడాల్సిన స్నేహితులే ఆమెపై అత్యాచారానికి పాల్పడితే, ఇక కాలేజీ యాజమాన్యం గానీ, పోలీసులు గానీ ఏం చేయగలరు?” అని ప్రశ్నించారు. కాలేజీతో, కాలేజీలోని వారితో సంబంధం లేకుంటే పూర్వ విద్యార్థి క్యాంపస్ లోకి ఎలా ప్రవేశిస్తాడని ప్రశ్నించారు.ఒక ప్రజాప్రతినిధిగా అత్యాచార బాధితురాలికి అండగా నిలవాల్సిన కళ్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee), బాధితురాలిదే తప్పన్నట్లు మాట్లాడటంపై మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు బాధితురాలిని అవమానించేలా ఉన్నాయని, ఇది బాధ్యతారాహిత్యమని పలువురు విమర్శిస్తున్నారు.

Read Also: Shefali Jariwala: గుండెపోటుతో నటి షఫాలీ జరివాలా మృతి

#BlamingTheVictim #KalyanBanerjee #KolkataGangrape #TMCControversy Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.