అస్సామీ సంగీతప్రియులలో ప్రసిద్ధి పొందిన గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen garg) సింగపూర్‌లో అనుకోకుండా మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత సృష్టించింది. సెప్టెంబర్ 19న సింగపూర్‌లో జరగనున్న 20వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వెళ్లిన జుబీన్, అక్కడ ఓ బోట్ ట్రిప్ సమయంలో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ అనూహ్య ఘటనపై ఇప్పటికే అనేక ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి.
Crime News: పెద్దనాన్న లైంగిక వేధింపులతో మైనర్ బాలిక ఆత్మహత్య
ఇదిలా ఉంటే,జుబీన్ గార్గ్ మృతి కేసు మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే జుబీన్ మేనేజర్‌తో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి (Shekhar Jyoti Goswami) సహ గాయనీ అమృతప్రభ మహంతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిద్దరూ జుబీన్ మృతిచెందిన సమయంలో ఆయనతో సముద్రంలో ఉన్నారు. గోస్వామి సమీపంలో ఈత కొడుతూ కనిపించగా, మహంత తన సెల్‌ఫోన్‌లో ఆ ఘటనను వీడియో తీయడం నిర్ధారించబడింది. ఈ ఆధారాల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డ్రైవింగ్ కూడా చేయడానికి ఆయనకు అనుమతి లేదని
తాజాగా మీడియాతో మాట్లాడిన జుబీన్ గార్డ్ భార్య గరిమ సైకియా గార్గ్ (Saikia Garg) పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలను బట్టి చూస్తుంటేనే.. ఆ రోజు ఆయన ఎంతగా అలసిపోయి ఉన్నారో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. అలాగే ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. తరచూ ఫిట్స్ వస్తుందనే విషయం కూడా అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు.
నీటి దగ్గరికో, నిప్పు దగ్గరికో వెళ్లవద్దని వైద్యులు ఆయనకు గట్టిగా చెప్పారని గుర్తు చేశారు. డ్రైవింగ్ కూడా చేయడానికి ఆయనకు అనుమతి లేదని సైకియా వెల్లడించారు. అయినప్పటికీ.. ఆయన్ను యాచ్ పార్టీకి తీసుకెళ్లారని ఆరోపించారు. కావాలనే నీటిలోకి అనుమతించారని.. అది కూడా లైఫ్ జాకెట్ లేకుండా ఈత కొట్టనిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను ఎందుకిలా నిర్లక్ష్యంగా చూశారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: