📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Sonam Raghuvanshi: భర్త హత్య, భార్య అదృశ్యం కేసులో కీలక పరిణామం

Author Icon By Vanipushpa
Updated: June 5, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేఘాలయ(Meghalaya)లో హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట అదృశ్యం కావడం, భర్త రాజా రఘువంశీ దారుణ హత్యకు గురికావడం సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య సోనమ్ రఘువంశీ(Sonam Raghuvanshi) ఆచూకీ కోసం గాలిస్తున్న మేఘాలయ పోలీసులకు బుధవారం ఉదయం సోహ్రా సమీపంలోని మాక్‌మా రోడ్డు వద్ద మరకలతో కూడిన ఒక రెయిన్‌కోట్ లభ్యమైంది. దీనిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు.

Sonam Raghuvanshi: భర్త హత్య, భార్య అదృశ్యం కేసులో కీలక పరిణామం

ఫోరెన్సిక్ పరీక్షల ద్వారానే నిర్ధారణ

ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సయీమ్ ఈ విషయంపై మాట్లాడుతూ, “మేము తడిసిపోయి ఉన్న ఒక రెయిన్‌కోట్‌ను స్వాధీనం చేసుకున్నాం. దానిపై కొన్ని మరకలు ఉన్నాయి, అవి రక్తపు మరకలా కాదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఫోరెన్సిక్ పరీక్షల ద్వారానే అది నిర్ధారణ అవుతుంది” అని తెలిపారు. లభ్యమైన వీడియో ఫుటేజ్‌లో సోనమ్ ధరించిన రెయిన్‌కోట్‌తో ఇది సరిపోలుతుందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అయితే, ఆ రెయిన్‌కోట్ సైజు 3ఎక్స్ఎల్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ నలుపు-పింక్ రంగు రెయిన్‌కోట్‌ను మాక్‌మా గ్రామంలోని ఏడీ వ్యూపాయింట్ వద్ద కనుగొన్నారు.

రెయిన్‌కోట్ సోనమ్‌ది

కాగా, ఈ రెయిన్‌కోట్ సోనమ్‌ది కాదని ఆమె సోదరుడు గోవింద్ చెబుతున్నారు. “పోలీసులకు దొరికిన రెయిన్‌కోట్ ఆమెది కాదు. అది ఎక్స్ఎక్స్ఎల్ సైజులో ఉంది, కచ్చితంగా ఆమెది కాదు. రాజా మృతదేహం లభ్యమైనప్పుడు అతను రెయిన్‌కోట్ ధరించి ఉన్నాడు, కాబట్టి అది అతనిది కూడా కాదు” అని గోవింద్ అన్నారు. సోమవారం నాడు అధికారులు వీసాడాంగ్ లోయలో రాజా రఘువంశీ (29) కుళ్లిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మృతదేహం వద్ద హత్యాయుధంగా భావిస్తున్న ఒక వేటకొడవలిని కూడా పోలీసులు కనుగొన్నారు. రాజా మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ఎస్పీ తెలిపారు.

అదృశ్యమైన సోనమ్ కోసం గాలింపు చర్యలు

రాజా హత్య కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. మరోవైపు, అదృశ్యమైన సోనమ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. “ఈ గాలింపు చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక మరియు అత్యవసర సేవల సిబ్బంది, సిట్, ఎస్ఓటీ బృందాలతో పాటు స్థానిక వాలంటీర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. మొత్తం 50 నుంచి 60 మందికి పైగా ఈ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు” అని ఎస్పీ వివరించారు. ఈ కేసు చుట్టూ అలుముకున్న ఊహాగానాల గురించి ఎస్పీ మాట్లాడుతూ, “ఈ ఘటనకు సంబంధించి చాలా వాదనలు ప్రచారంలో ఉంటాయని మాకు తెలుసు. దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటైంది. మేము సాక్ష్యాధారాలను సేకరించి, వాస్తవాలను వెలికితీస్తాం. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. వాస్తవాలు, పరిస్థితులు, లభించిన ఆధారాల బట్టి దర్యాప్తు ముందుకు సాగుతుంది. ఆ తర్వాత దర్యాప్తు ఏ దిశగా వెళ్లాలో స్పష్టమవుతుంది” అని తెలిపారు.

Read Also: Mallikarjun Kharge: సమితిలో పాక్‌కు కీలక పదవులా?..ఖర్గే ధ్వజం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Key development in husband's murder Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today wife's disappearance case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.