Karnataka crime: బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

Read Time:  1 min
Karnataka crime: కోడలిని వ్యభిచార కూపంలోకి నెట్టిన అత్తింటివారు.. మహిళ ఆత్మహత్య
Karnataka crime: కోడలిని వ్యభిచార కూపంలోకి నెట్టిన అత్తింటివారు.. మహిళ ఆత్మహత్య
FONT SIZE
GET APP

Karnataka crime: కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవకళ్యాణ్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, కన్నూమిన్నూ కానని అత్తింటివారు ఒక వివాహితను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. వారి వేధింపులను తట్టుకోలేక సదరు బాధితురాలు ప్రాణాలు తీసుకుంది.

Read also: Telangana: కీలక మావోయిస్టు నేత ప్రభాకర్ హతం

Karnataka crime: Forced attempt at prostitution.. Married woman commits suicide due to resentment
Karnataka crime: Forced attempt at prostitution.. Married woman commits suicide due to resentment

ఘటన వివరాలు

అంజనాబాయి అనే మహిళకు 2022లో శేఖర్ పాటిల్‌తో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన నాటి నుంచే ఆమెను అత్తింటి వారు అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా, ఆమెను బలవంతంగా అసాంఘిక(Prostitution) కార్యకలాపాల్లోకి దింపేందుకు ప్రయత్నించారని మృతురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘోర అవమానాన్ని భరించలేక అంజనాబాయి గత వారం ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసుల చర్యలు

మృతురాలి తండ్రి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు శేఖర్ పాటిల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.