హైదరాబాద్ లో మానవ సంబంధాల విలువను ప్రశ్నించేలా జరిగిన ఈ ఘటన జీడిమెట్ల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ పదవ తరగతి విద్యార్థినీ తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపిన విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.జీడిమెట్ల (Jedimetla) లో ఓ పదవ తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది. తమ ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించి, మందలించినందుకు తల్లిని కిరాతకంగా చంపేసింది. ప్రియుడితో పాటు అతడి సోదరుడితో కలిసి కన్నతల్లి ఊసురు తీసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీడిమెట్లకు చెందిన బాలిక స్థానికంగా పదో తరగతి చదువుతోంది. ఆమెకు శివ(19) అనే కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసుకుంది. ఇద్దరూ గాఢ ప్రేమలో మునిగిపోయారు. ఫోన్లు, మెసేజ్ (Message) లతో పాటు చెట్టాపట్టాలేసుకొని తిరగటం ప్రారంభించారు. ఈ విషయం తల్లికి తెలిసింది. ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని బాగా చదువుకోవాలని కూతురిని మందలించింది. దీంతో తల్లిపై బాలిక పగ పెంచుకుంది.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు
తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది.ఇద్దరూ కలిసి తల్లి హత్యకు స్కెచ్ వేశారు. అందుకు శివ తన సోదరుడు యశ్వంత్ సహాయం తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేసారు. గొంతు నులుమి, తలపై రాడ్డుతో కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: MGNREGS: రికార్డు స్థాయిలో తెలంగాణలో ఉపాధి హామీ పనులు