📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Chhattisgarh: క్షణికావేశంలో భార్యను హతమార్చిన భర్త

Author Icon By Anusha
Updated: April 22, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లా సులేసా గ్రామానికి చెందిన 38 ఏళ్ల ధూలారామ్‌కు ఇప్పటికే 10 సార్లు వివాహం జరిగింది. అయితే మొదటి 9 మంది భార్యలు అతడి తీరు నచ్చక వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అతడు 10వ భార్యగా బసంతి బాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య కాపురం బాగానే సాగుతుండగా ఇటీవలే బంధువులు పెళ్లికి ఆహ్వానించారు. దీంతో ఏప్రిల్ 16వ తేదీ రోజు ధూలా రామ్, బసంతి బాయి ఇద్దరూ కలిసి బాగిచా ప్రాంతంలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యారు. ఉదయమే వెళ్లగా సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అయితే ఇదే పెళ్లిలో బసంతి బాయి దొంగతనం చేసింది.కొత్త బట్టలు, నిత్యాసవర సరుకులు అయిన పప్పులు, బియ్యం, వంట నూనె వంటివి తీసుకుని పరారైంది. అయితే ఇదంతా చూసిన కొందరు అక్కడున్న వారందరికీ విషయం చెప్పారు. ముఖ్యంగా భార్య దొంగతనం చేసిన పారిపోయిన విషయం తెలియని ధూలా రామ్ అక్కడే ఉండగా అతడిని కూడా పలువురు ప్రశ్నించారు. దీంతో అవమానం తట్టుకోలేని అతడు వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. ఇక భార్య బసంతి బాయి ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలోనే స్థానికంగా ఉన్న ఓ అడవిలో ఆమె నిద్రిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే అక్కడకు చేరుకుని ఆమెతో గొడవకు దిగాడు. బసంతి బాయి కూడా అతడికి గట్టిగానే సమాధానం చెప్పింది.

తీవ్రమైన దుర్వాసన

భార్యభర్తలిద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరగ్గా విపరీతమైన కోపానికి గురైన అతడు బసంతి బాయిపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా కొడుతుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో భయపడిపోయిన ధూలారామ్ ఆమెను అక్కడే పడేసి పైనుంచి ఎండిన ఆకులు, చెత్తా చెదారం కప్పేసి పారిపోయాడు. అయితే 5 రోజుల తర్వాత అక్కడ నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికంగా ఉన్న కొందరు అక్కడికెళ్లి చూశారు. మృతదేహాన్ని గుర్తించగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు.

హత్య

సంఘటనా స్థలం వద్దే మహిళకు చెందిన ఫోన్ దొరకగా ఆమెను బసంతి బాయిగా గుర్తించారు. ఆపై ఆమె భర్త ధూలా రామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. దొంగతనం చేసిందనే కోపంతో తానే భార్యను హత్య చేశానిని బసంతి బాయి తన 10వ భార్య అని వెల్లడించాడు. దీంతో షాకైన పోలీసులు అతడు గతంలోనూ ఏమైనా నేరాలు చేశాడా అనే కోణంలో విచారిస్తున్నారు.

Read Also: Karnataka: మాజీ డీజీపీ హత్య కేసు వెలుగులోకి సంచలన విషయాలు

#BizarreStory #MultipleMarriages #StrangeButTrue #ViralNews #WeirdNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.