Himachal Pradesh: భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

Read Time:  1 min
Himachal Pradesh
Himachal Pradesh
FONT SIZE
GET APP

హిమాచల్ ప్రదేశ్‌లోని(Himachal Pradesh) సోలన్ జిల్లా అర్కి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నేపాల్‌కు చెందిన ఒక చిన్నారి మృతి చెందగా, మరో తొమ్మిది మంది వలస కూలీలు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నివాసాలు, దుకాణాల్లో మంటలు చెలరేగడంతో పరిస్థితి భయానకంగా మారింది.

Read Also: Hyderabad crime: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

Himachal Pradesh

అగ్ని ప్రమాదం తీవ్రతకు సుమారు 10 నుంచి 15 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రాథమికంగా గ్యాస్ సిలిండర్ పేలుడే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక(Himachal Pradesh) దళాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం గల్లంతైన వలస కూలీల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన అనంతరం కారణాలపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.