📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Karnataka: తొక్కిసలాటపై సర్కార్ సీరియస్.. పలువురు అధికారుల సస్పెన్షన్!

Author Icon By Vanipushpa
Updated: June 6, 2025 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు తొక్కిసలాట విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది కర్నాటక ప్రభుత్వం. కేబినెట్‌లో చర్చించి.. కీలక ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddarammaiah). పోలీస్ శాఖలో గతంలో ఎన్నడూ లేనన్ని సస్పెన్షన్లు, అరెస్ట్‌లకు ఆర్డర్లు(Arrest) ఇచ్చారు. ఆర్సీబీ(RCB) విజయోత్సవాల సందర్భంగా.. బెంగళూరు(Bengulor) చిన్నస్వామి స్టేడియం దగ్గర చోటుచేసుకున్న విషాద ఘటనపై చర్యలు ప్రారంభించింది కర్నాటక ప్రభుత్వం. తొక్కిసలాటలో.. 11మంది చనిపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది సిద్ధరామయ్య సర్కార్‌. బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌తో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

RCB:తొక్కిసలాటపై సర్కార్ సీరియస్.. పలువురు అధికారుల సస్పెన్షన్!

అడిషనల్ సీపీ, డీసీపీ, కబ్బన్‌ పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ
సస్పెండ్‌ అయిన వారిలో.. సీపీ దయానందతో పాటు అడిషనల్ సీపీ, డీసీపీ, కబ్బన్‌ పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఎస్ఐ, క్రికెట్‌ స్టేడియం పోలీస్‌ ఇన్‌ఛార్జి ఉన్నారు. సస్పెన్షనే కాదు.. ఆర్సీబీ ప్రతినిధులు, డీఎన్‌ఏ ఈవెంట్ మేనేజర్స్, కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను తక్షణమే అరెస్టు చేయాలని డీజీపీ, ఐజీపీని ఆదేశించారు సీఎం. అడిషినల్ డీజీపీగా ఉన్న సీమంత్ కుమార్‌ సింగ్‌ను బెంగళూరు కొత్త సీపీగా అపాయింట్ చేశారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించి.. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డెడ్‌లైన్ పెట్టారు సీఎం సిద్దరామయ్య.
ఏ1గా ఆర్సీబీ, ఏ2గా DNA మేనేజ్‌మెంట్, ఏ3గా కర్నాటక క్రికెట్ అసోసియేషన్‌
తొక్కిసలాటపై.. సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో.. ఏ1గా ఆర్సీబీ, ఏ2గా DNA మేనేజ్‌మెంట్, ఏ3గా కర్నాటక క్రికెట్ అసోసియేషన్‌ను చేర్చారు. నేరపూరిత నిర్లక్ష్యంగా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు.. తొక్కిసలాట ఘటన బాధాకరమంటూ భావోద్వేగానికి లోనయ్యారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.

Read Also: Simla Agreement: సిమ్లా ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

#telugu News about the stampede. Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Government serious Latest News in Telugu Paper Telugu News Several officials suspended! Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.