📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Hyd-Crime: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమకు తల్లి బలి: జీడిమెట్లలో అమానుషం

Author Icon By Vanipushpa
Updated: June 25, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ జీడిమెట్ల*Hyderabad Jeedimetla)లో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటనకు రాష్ట్రమంతా దిగ్భ్రాంతి చెందుతోంది. 15ఏళ్ల బాలిక తన ఇన్‌స్టాగ్రామ్(Istagram) ప్రియుడితో కలిసి కన్న తల్లిని పాశవికంగా హత్య చేయించింది. మానవ సంబంధాల పరిపక్వత లేకుండా ఉన్న వయసులో అమ్మ ప్రేమను పక్కన పెట్టి ప్రేమ జంట చేసిన పని నిస్సహాయతకు ఉదాహరణగా మారింది. ఈ అమానుష ఘటన హైదరాబాద్లో లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆమె ప్రియుడి సోదరుడు ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు
తల్లిని మందలించిందని చంపేందుకు ప్రణాళిక
మహబూబాబాద్‌ జిల్లా(Mahabubnagar District)) ఇనగుర్తికి చెందిన సట్ల అంజలి(Anjali) (39) సాంస్కృతిక కళాకారిణి. మొదటి భర్త మృతిచెందడంతో రెండో పెళ్లి చేసుకున్న ఆమె, రెండో భర్త మరణానంతరం రెండు కుమార్తెలతో కలిసి జీవిస్తోంది. పెద్ద కుమార్తె ఓ డీజే యువకుడితో (శివ, 19) ఇన్‌స్టాలో పరిచయమై ప్రేమలో పడింది. తల్లి అంజలి దీనిని అంగీకరించకపోవడంతో, ఆమెను హత్య చేయాలని బాలిక నిర్ణయించుకుంది.
చాటింగ్‌లో ‘చంపేద్దామా’.. బెదిరింపుతో ఒప్పిన ప్రియుడు
తల్లిని చంపాలని బాలిక తన ప్రియుడికి చాటింగ్ ద్వారా తెలిపింది. తొలుత శివ నిరాకరించగా, ‘ఒప్పుకోకపోతే నేను చనిపోతా, నా మరణానికి నీవే కారణం’ అని బెదిరించింది. శివ కూడా మైనరైన తన సోదరుడితో కలిసి ఈ కుట్రకు ఒప్పుకున్నాడు.

Hyderabad Crime: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమకు తల్లి బలి: జీడిమెట్లలో అమానుషం

హత్యా తంతు: చున్నీతో గొంతు నులిమి, మళ్ళీ వచ్చి ఖాతం
జూన్ 24న మధ్యాహ్నం సమయంలో బాలిక తల్లి ఇంట్లో ఉండగానే, శివ, అతడి సోదరుడు వచ్చారు. ఆమె వారిని లోపలికి పంపి తానే బయట కాపలా కాసింది. లోపల ఇద్దరు కలిసి అంజలి మెడకు చున్నీ బిగించి, తలపై గాయాలు చేసి అపస్మారక స్థితిలోకి నెట్టారు. బాలిక చెల్లెలు ఇంటికి వచ్చేసరికి ఆమెను తప్పించిచెప్పి పక్కింటికి పంపింది. తల్లి మరణించలేదని తెలిసి శివను మళ్ళీ ఫోన్‌లో పిలిచి “అమ్మ ఇంకా బతికే ఉంది.. వచ్చి చంపెయ్” అన్నది. ఇద్దరు తిరిగొచ్చి మరల చున్నీ బిగించి హత్య చేశారు.
ఆత్మహత్య డ్రామా: పోలీసుల పటిమతో అసలు నిజం వెలుగులోకి
తల్లి ఉరివేసుకుని చనిపోయిందంటూ నాటకం వేసిన బాలిక.. పోలీసుల ప్రశ్నలతో విరిగిపోయింది. విచారణలో ఆమె హత్యకు ప్రణాళిక తయారు చేసి, ప్రియుడి సహాయంతో మాతృహత్య చేసినట్లు ఒప్పుకుంది. జీడిమెట్ల పోలీసులు బాలికతో పాటు శివ, అతడి సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా వలయంలో పడిన బాలల మానసిక పరిస్థితిపై తల్లిదండ్రులు, సమాజం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వ్యవహారం అనుమానాస్పదంగా ఉండడంతో బాలికను గట్టిగా ప్రశ్నించగా.. శివ, అతడి సోదరుడితో కలిసి తల్లిని హత్య చేయించినట్లు అంగీకరించిందని జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ చెప్పారు.

Read Also: Betting App: బెట్టింగ్​ యాప్.. నలుగురు ఇన్​ఫ్లూయెన్సర్లు అరెస్ట్ చేసిన పోలీసులు

#telugu News affair Ap News in Telugu Breaking News in Telugu case girl Google News in Telugu hyderabad in Instagram Jeedimetla kills Latest News in Telugu love Mother Murder Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.