Crime: కదులుతున్న అంబులెన్స్ లో యువతిపై సామూహిక అత్యాచార

Read Time:  1 min
కదులుతున్న అంబులెన్స్ లో యువతిపై సామూహిత అత్యాచార
కదులుతున్న అంబులెన్స్ లో యువతిపై సామూహిత అత్యాచార
FONT SIZE
GET APP

మనం ఏ యుగంలో జీవిస్తున్నామో తెలియడం లేదు. నిస్సహాయస్థితిలో ఉన్న యువతిని కాపాడాల్సిన అంబులెన్స్(Ambulance) సిబ్బందే దారుణానికి ఒడిగట్టారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఒకటి బీహార్(Bihar) లో జరిగింది. ఈనెల 24వ తేదీన జరిగిన ఈ ఘటన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల యువతి బీహార్ లోని గయాలో జిల్లాలోని మిలిటరీ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరైంది. అధికారులు ఆమెకు ఫిజికల్ టెస్టు నిర్వహిస్తుండగా ఆ యువతి కళ్లుతిరిగి కిందపడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్సును ఏర్పాటు చేశారు. అప్పటికే స్పృహకోల్పోయిన ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.

Rape: కదులుతున్న అంబులెన్స్ లో యువతిపై సామూహిత అత్యాచార
Rape: కదులుతున్న అంబులెన్స్ లో యువతిపై సామూహిత అత్యాచార

సామూహిక అత్యాచారం
మార్గమధ్యలో తనను పలువురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను స్పృహ కోల్పోయి ఉండగా కదులుతున్న అంబులెను సలోనే తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది. కేసు నమోదు చేసుకున్న బోదయా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ
ఫూటేజ్ ఆధారంగా వాళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Ashok Gajapathi Raju: గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.