📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Hyderabad :హైదరాబాదులో విదేశీయురాలిపై సామూహిక అత్యాచారం..

Author Icon By Anusha
Updated: April 5, 2025 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ మీర్పేట్ లో ప్రాంతంలోని పహాడీ షరీఫ్ వద్ద దారుణమైన సంఘటన జరిగింది, జర్మనీకి చెందిన ఓ యువతి నగరాన్ని సందర్శించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చింది. మీర్‌పేట మందమల్లమ్మ సెంటర్ వద్ద రాత్రి ఒంటిరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెను చూసిన కొందరు తాము లిఫ్ట్ ఇస్తామని యవతిని నమ్మించారు.

కేసు నమోదు

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విదేశీయురాలుకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి మీర్పేట్ వద్ద యువకులు ఆమెను తీసుకుని వెళ్లారు. పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో విదేశీయురాలిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి గురైన యువతిని జర్మనీ దేశస్థురాలుగా గుర్తించారు. తనపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.లైంగిక దాడికి గురైన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరొకచోట సామూహిక అత్యాచారం

తనపై గుర్తుతెలియని ఏడుగురు సామూహిక అత్యాచారం జరిపినట్లు ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం,రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు ముగ్గురు పిల్లలు. భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ్లుగా అతడికి దూరంగా ఉంటోంది.తన బంధువుతో కలిసి నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేట మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ దర్శనానికి వచ్చింది. ఇద్దరూ స్వామివారిని దర్శించుకొని సమీపంలోని ఓ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ ఆలయ తాత్కాలిక ఉద్యోగి వీరిని చూసి తన స్నేహితులకు సమాచారమిచ్చాడు. కొద్దిసేపటికి ఓ ఆరుగురు అక్కడికొచ్చారు.

మద్యం మత్తులో

ఆ ఉద్యోగి సహా ఏడుగురు మద్యం మత్తులో ఆ యువతి, ఆమెతో పాటు వచ్చిన బంధువుతో గొడవపడ్డారు. అనంత రం వివాహితతో వచ్చిన వ్యక్తిని చెట్టుకు కట్టేసి,ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం జరిపారు. బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ పరిశీలించారు. నిందితులను ఊర్కొండపేటకు చెందిన మహేశ్‌ గౌడ్‌, మార్పాకుల ఆంజనేయులుగౌడ్‌, మట్ట ఆంజనేయులు గౌడ్‌, సాదిక్‌ బాబా, కౌకుంట్ల హరీశ్‌గౌడ్‌, వాగుల్దాస్‌ మణికంఠ గౌడ్‌, ఎల్లికట్టకు చెందిన కార్తీక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచినట్లు సమాచారం. మరో ఇద్దరు కూడా వీరికి సహకరించినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరి ఆచూకీ కూడా తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.

అత్యాచారం

ప్రస్తుతం అత్యాచారాల కేసులు ఎక్కడో ఒకచోట నమోదవుతున్నాయి.అనేక మంది మహిళలు, బాలికలు, పిల్లలపై జరుగుతోంది.అత్యాచారం వంటి నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది,కఠిన చట్టాలు అమలు పరచడం అవసరం.

#Crime #Foreigner #GangRape #GermanyNational #Hyderabad #Meerpet #PoliceInvestigation Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.