Gachibowli Drugs Case: హైదరాబాద్‌లో డెడ్ డ్రాప్ డ్రగ్స్ ముఠా బట్టబయలు

Read Time:  1 min
Gachibowli Drugs Case
Gachibowli Drugs Case
FONT SIZE
GET APP

Gachibowli Drugs Case : నగరంలో డ్రగ్స్ భూతం రోజురోజుకు జడలు విప్పుతుంది. ఓ వైపు ఈగల్ టీం, పోలీసులు పటిష్ట నిఘాతో కట్టడి చేస్తుండగా, మరోవైపు డ్రగ్స్ సరఫరాదారులు కొత్త దారులను వెదుకుతున్నారు. తాజాగా నగరంలో డెడ్ డ్రాప్ డ్రగ్స్ సరఫరా బయటపడడం సంచలనం గా మారింది. కొండాపూర్లో ఓ అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఈగల్ టీం, గచ్చిబౌలి పోలీసులు దాడులు చేసి పట్టు కోగా, ఈ ముఠా డెడ్ డ్రాప్ తరహాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు సభ్యుల ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి వద్ద నుంచి 32 గ్రాము ల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also:Cyber Crime: లోన్ యాప్ మోసాలపై జాగ్రత్త..!

Gachibowli Drugs Case
Gachibowli Drugs Case: Dead Drop Drugs Gang Exposed in Hyderabad

ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మురళీ కృష్ణంరాజు(24) ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి కొన్నాళ్లు ప్రైవేటు ఉద్యోగాలు చేశాడు. వాటిలో ఎక్కువ డబ్బు దొరక్క పోవడం, జల్సాలు, డ్రగ్స్ సేవించడం అలవాటు కావడంతో ఖర్చులు పెరి గాయి. దీంతో తానే డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించాడు. మొదట మణికొండలో ఉండే ఓ వ్యక్తి నుంచి గ్రాము కొకైన్ 10వేలకు కొనుగోలుచేసి 11వేలకు తెలిసిన వారికి విక్రయించేవాడు. కాగా మణికొండ వ్యక్తి పోలీసులకు పట్టుబడడంతో బెంగళూరుకు చెందిన నైజీరియన్ వద్ద నుంచి డ్రగ్స్ కొను గోలు చేసి నగరానికి తీసుకు వస్తున్నాడు. గోవాలో మరో వ్యక్తి వద్ద సైతం గ్రాము 7వేలకు కొని, నగరానికి తీసుకువచ్చి 12 వేలకు విక్రయిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కెపిహెచ్బిలో నివాసం ఉంటున్న స్నేహితుడు భూపతిరాజు చిరంజీవివర్మ(28)ను సైతం ఇందులో భాగం చేసి వినియోగ దారులకు డ్రగ్స్ ను సర ఫరా చేయించ సాగాడు.

మరో నిందితుడు, కృష్ణం రాజుకు వరుసకు సోదరుడు హేమంత్రారాజు(37) డ్రగ్స్ కు బానిసగా మారగా, ఇతన్ని సైతం సరఫరాలో భాగం చేసి దందా చేస్తున్నాడు. కొండాపూర్లోని వెంకటేశ్వర రెసిడెన్సీలో వీరు డ్రగ్స్ ఉన్నారని సమాచారం అందుకున్న ఈగల్ టీం, గచ్చిబౌలి పోలీసులు సంయు క్తంగా దాడులుచేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 15మంది వినియోగదారుల వివరాలను సేకరించి, వారికి నోటీసులు జారీ చేశారు.
డెడ్ డ్రాప్ సరఫరా: ఈ ముఠా డ్రగ్స్ సరఫరా కోసం డెడ్ డ్రాప్ విధానాన్ని ఎంచుకొని తమ వివరాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. వైఫైతో పనిచేసే వాట్సాప్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ తీసుకొని, బెంగళూరులోని తన స్నేహితుల అకౌంట్లకు పేమెంట్ను కృష్ణం రాజు చేయించుకుంటాడు. అనంతరం వారు కృష్ణంరాజుకు ట్రాన్స్ ఫర్ చేస్తుం టారు. డబ్బు చెల్లించిన వారికి డెడ్ డ్రాప్ విధానంలో సరఫరా చేస్తుంటారు. నిర్మానుష్య ప్రదేశంలో డ్రగ్స్ న్ను పెట్టి, సదరు ప్రదేశం లోకేషన్, ఆనవాళ్లను వినియోగదారులకు చేరవేస్తారు. వారిని అక్కడికి వెళ్లి డ్రగ్స్ తీసు కోమని సూచిస్తారు. డెడ్ డ్రాప్ విధానాన్ని ఉపయోగించే పోలీసులు పట్టుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.