📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Hotel Fire: హోటల్లో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

Author Icon By Vanipushpa
Updated: May 1, 2025 • 5:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని నాజ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించి, లోపల ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని కొందరు చెబుతుండగా, హోటల్‌లోని ఏసీ పేలడమే ప్రమాదానికి కారణమని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

బిడ్డను సురక్షితంగా పట్టుకున్నారు
ఈ విపత్కర పరిస్థితుల్లో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తులో మంటలు, పొగలో చిక్కుకున్న ఒక తల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు సాహసం చేసింది. తన చిన్నారిని కిందకు విసిరేయగా, అప్రమత్తంగా ఉన్న స్థానికులు ఆ బిడ్డను సురక్షితంగా పట్టుకున్నారు. ఈ ఘటనలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఆ తరువాత, ఆ తల్లి కూడా కిందకు దూకేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రతికూల పరిస్థితుల్లో కారణంగా అక్కడే చిక్కుకుపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: In-Pakistan: ఇకపై పాక్​ విమానాలకు భారత్​లో ప్రవేశం నిషిద్ధం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Fire accident in hotel. four dead Google News in Telugu Latest News in Telugu Mother threw her child down Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.