Road Accident :కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Read Time:  1 min
Road Accident :కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
FONT SIZE
GET APP

కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది.
ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, కారు బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం విజయపుర (Vijayapura) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 Road Accident :కర్ణాటకలో  ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Road Accident :కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి


అదుపుతప్పిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌
సోలాపూర్‌ వైపు వెళ్తున్న మహీంద్ర ఎస్‌యూవీ కారు బసవనబాగేవాడి తాలూకాలోని మనగులి పట్టణం సమీపంలోకి రాగానే అదుపుతప్పి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి ఓ కంటైనర్‌ ట్రక్కుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్‌ కూడా మరణించాడు. ప్రమాద సమాచారం అందుకున్న మనగులి పోలీసులు (Managuli police) ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులను తెలుసుకునేందుకు CCTV ఫుటేజ్ పరిశీలన చేపట్టారు.

Read Also : UPSC Results : ఐఎఫ్‌ఎస్‌ పరీక్షల్లో తెలుగువారి సత్తా…

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.