📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Bengaluru: రెండో అంతస్తు నుంచి కుక్కను తోసేసిన వైద్యుడు ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: April 26, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత సమాజంలో జంతుప్రేమ పెరుగుతున్నా, కొందరి మధ్య జంతువుల పట్ల కఠినత కూడా అంతే వేగంగా పెరుగుతోంది. లక్షలు ఖర్చు పెట్టి కుక్కలను పెంచుకునే వారు, పిల్లలాగే వాటిని చూసుకునే సంస్కృతి విస్తరిస్తోంది. వారు తమ పెంపుడు జంతువుల పట్ల అపారమైన ప్రేమను చూపుతుంటారు. వాటికి ఏ చిన్న హాని జరిగినా తట్టుకోలేరు. కానీ కొందరు జంతువులను చూస్తేనే కోపంతో రగిలిపోతారు. వారు వాటిపై పగ పెంచుకొని హింసించే ప్రయత్నాలు చేస్తూ మానవత్వాన్ని మరిచిపోతున్నారు.ఇటీవల బెంగళూరులో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగుచూసింది.అపార్ట్‌మెంట్‌ నుంచి ఓ వైద్యుడు కుక్కను తోసి చంపాడనే 22 ఏళ్ల విద్యార్థి ఆయుష్ బెనర్జీ ఫిర్యాదుతో అడుగోడి పోలీసులు ఏప్రిల్ 22న బల్లాల్ అనే వైద్యుడి పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 325 (జంతువును చంపడం) కింద కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాలు

బల్లాల్ గతంలోనూ స్కూబీ అనే కుక్కను ఇదే విధంగా పై అంతస్తు నుండి విసిరివేసినట్లు స్థానికులు ఆరోపించారు. “ఫిబ్రవరి 5న, తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కుక్క అరుపులు విన్న తాము బయటకు వచ్చి చూడగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గాయాలతో పడి ఉన్న కుక్క కనింపించిందని దానిని వెంటనే బెంగళూరులోని ఒక వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లిన్నట్టు తెలిపారు. ఆకుక్కను పరీక్షించిన వైద్యులు దాని వెన్నెముక విరిగిందని, ఇతర గాయాలు కూడా అయ్యాయని చెప్పినట్టు తెలిపారు. అయితే ఆ కుక్క పై నుంచి పడిన సమయంలో వైద్యుడు బల్లాల్  తన అపార్ట్‌మెంట్‌ వద్ద కనిపించాడని,వెంటనే లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడని తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లినా అతని స్పందించలేదని తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేకపోవడంతో అప్పుడు పోలీసులను సంప్రదించలేదని ఓ స్థానికుడు చెప్పాడు.

బల్లాల్

ఏప్రిల్ 20న, తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మళ్లీ అలాంటి ఓ పెద్ద శబ్దమే తనకు వినిపించిందని,బయటకు వచ్చి చూడగా గ్రౌండ్‌ ప్లోర్‌లో పార్క్‌ చేసి ఉన్న కారుపై కుక్క పడిపోయి ఉందని తెలిపారు.  దాని తలకు తీవ్ర గాయం కావడంతో ఆ కుక్క చనిపోయినట్టు స్థానికుడు చెప్పాడు. అయితే 2022లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా బల్లాల్ ఓ వీధికుక్క మృతికి కారణమయ్యాడని పోలీసులు కనుగొన్నారు. ఆగస్టు 7, 2022న జరిగిన ఈ వీధి కుక్క మరణానికి బల్లాల్ కారణమని ఆరోపిస్తూ, పీపుల్ ఫర్ యానిమల్స్ అనే ఎన్జీఓ అతనిపై ఇండోర్‌లోని పలాసియా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు.

Read Also: Pahalgam Attack: పహల్గాం దాడితో కశ్మీర్ భద్రతపై ప్రజల ఆందోళనలు!

#AnimalCruelty #AnimalProtection #AnimalRights #bangalore #CrueltyAgainstAnimals #DogAbuse #JusticeForAnimals Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.