Depalli murder case: దారుణం.. పనికి వెళ్లమన్నందుకు తండ్రిని కడతేర్చిన కొడుకు

Follow Us: Google News Daily Hunt
Son kills father who told him to go to work.
Son kills father who told him to go to work.
FONT SIZE
GET APP

Depalli murder case:పనికి వెళ్ళమన్నందుకు కన్న తండ్రినే హత్య చేసిన కొడుకు. పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నావని తండ్రి మందలించాడనే కోపంతో కన్న కొడుకే తండ్రిని కర్రతో, రాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన నవాబ్ పేట మండలం దేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దేపల్లి గ్రామానికి చెందిన రాపోలు రాములు (55) కుమారుడు సురేందర్ గత కొంతకాలంగా ఎలాంటి పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో తండ్రి రాములు తరచూ మందలిస్తూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన సురేందర్ మళ్లీ తండ్రితో గొడవకు దిగాడు. ఆగ్రహంతో తండ్రిని బలంగా నెట్టివేసి, కర్రతో, రాయితో తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రాములు తలకు, ఎడమ కనతపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఎడమ కాలికి కూడా గాయాలయ్యాయి.

Read also: Chandigarh Police : చండీగఢ్ పోలీసు అధికారిని తన టీనేజ్ కుమారుడే కాల్చి చంపిన వైనం

Son kills father who told him to go to work.
Son kills father who told him to go to work.

Depalli murder case:పనికి వెళ్లాలని చెప్పడమే తండ్రి చేసిన తప్పా

కుటుంబ సభ్యులు గమనించి రాములను ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టగా అప్పటికే మృతి చెందాడు. అనంతరం నిందితుడు సురేందర్ తన అన్న, మృతుడి పెద్ద కుమారుడు రాపోలు శ్రీకాంత్ కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. షాద్ నగర్ లో ఉన్న శ్రీకాంత్ హుటాహుటిన గ్రామానికి చేరుకుని తండ్రి మృతదేహాన్ని చూసి నవాబ్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నవాబ్ పేట ఎస్సై నరేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి పెద్ద కుమారుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన అనంతరం గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో నిందితుడు సురేందర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు