📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Delhi: టెంపోలో ముందు సీటు కోసం గొడవ.. తండ్రిని చంపిన కొడుకు

Author Icon By Anusha
Updated: June 28, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోజురోజుకీ మనుషుల మధ్య ఆప్యాయతలు, నమ్మకాలు తగ్గిపోతున్న వేళ, కొన్ని సంఘటనలు మనసును కలిచివేస్తున్నాయి. చిన్నచిన్న విషయంలోనే ఓపిక కోల్పోయి, తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం మరొకరి జీవితానికే కాదు, తమ జీవితానికీ శాశ్వత నష్టం తీసుకొచ్చేలా మారుతోంది. జీవితం మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.ముఖ్యంగా టెంపో (Tempo)లో ముందు సీటులో కూర్చునే విషయంలో తలెత్తిన వివాదంతో కన్నతండ్రినే కాటికి పంపాడో కుమారుడు.కేవలం టెంపోలో ముందు సీటులో కూర్చోవడంపై జరిగిన వాగ్వాదం చివరకు విషాదానికి దారితీసింది. ఓ కుమారుడు తన కన్నతండ్రినే తుపాకీతో కాల్చి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

మృతుడు 60 ఏళ్ల సురేంద్ర సింగ్. ఆయన ఒక రిటైర్డ్ CISF సబ్-ఇన్‌స్పెక్టర్. నిందితుడు 26 ఏళ్ల దీపక్ సురేంద్ర సింగ్ కొడుకు. ఇటీవల పదవీ విరమణ పొందిన సురేంద్ర సింగ్ ఢిల్లీ నుంచి తిరిగి తమ సొంత ఊరు ఉత్తరాఖండ్‌కు మారాలని నిర్ణయించుకున్నారు. తమ సామాను తరలించడానికి ఒక టెంపోను అద్దెకు మాట్లాడుకున్నారు. గురువారం సాయంత్రం 7.30 గంటల సమయంలో కుటుంబం సామాన్లను టెంపోలో ఎక్కించి ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో తండ్రీ కొడుకుల మధ్య ఫ్రంట్ సీటులో ఎవరు కూర్చోవాలనే దానిపై వాగ్వాదం మొదలైంది. వెనక భాగంలో సామాను ఎక్కువ ఉండటంతో సురేంద్ర సింగ్ (Surendra Singh) ముందు సీటులో కూర్చుంటానని కుమారుడు దీపక్‌తో చెప్పాడు. దీంతో దీపక్ తీవ్రంగా కోపగించుకున్నాడు.

సురేంద్ర సింగ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు

దీపక్ ఆగ్రహంతో ఊగిపోయి, తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ గన్‌ను తీసుకుని సమీపం నుంచే అతనిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ సురేంద్ర సింగ్ ఎడమ చెంపకు తగలడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు తుపాకీ శబ్దం విని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమారుడే కాల్చినట్లుగా గుర్తించి దీపక్‌ను పట్టుకున్నారు. ఆపై తీవ్రంగా గాయపడిన సురేంద్ర సింగ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.స్థానికులు పోలీసులకు ఫోన్ చేయగా హుటాహుటినా వారు రంగంలోకి దిగారు.

Delhi:

కేసు నమోదు

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దీపక్‌ను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ, 11 లైవ్ కార్ట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీపక్‌ (Deepak) పై హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ హత్య క్షణికావేశంలో జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేవలం ముందు సీటు విషయంలో జరిగిన చిన్నపాటి గొడవ ఇంతటి విషాదానికి దారితీయడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

గౌరవం వంటి విలువలు నేటి సమాజంలో

ఒకటిరెండు నిమిషాల ఓపిక లేకపోవడం వల్ల ఎంతటి విషాదానికి దారి తీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. కోపం వచ్చినప్పుడు కొన్ని క్షణాలు ఆగితే ఎంతో భవిష్యత్తును కాపాడుకోవచ్చు. మానవత్వం, ప్రేమ, గౌరవం వంటి విలువలు నేటి సమాజంలో మరింత అవసరం. తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇచ్చారు.వారికి గౌరవం ఇవ్వడం మన బాధ్యత. ఇలాంటి సంఘటనలు ఇక మళ్లీ చోటు చేసుకోకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

Read Also: Kolkata: కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

#BreakingNews #crimenews #DelhiNews #IndiaNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.