📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Dating Apps: డేటింగ్​ యాప్స్ లో మోసపోతున్న యువత

Author Icon By Anusha
Updated: June 5, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో డేటింగ్ యాప్స్‌, మ్యాట్రీమోనియల్ సైట్లు, జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ముఖ్యంగా వీటిని దుర్వినియోగం చేస్తున్న కొంతమంది ‘కీలేడీలు’ (లేడీ మోసగాళ్లు) పురుషుల జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. ప్రేమ పేరుతో వల వేసి, దగ్గరగా వచ్చి, తరువాత వారిని మానసికంగా, ఆర్థికంగా దోచుకుంటున్నారు. ఈ ఘటనలు పోలీసులకు చేరిన కొద్ది కేసులు మాత్రమే. మిగతావి బాధితుల పరువు కోసం వెలుగులోకి రావడం లేదు.వీరిలో అధిక శాతం రెండో పెళ్లికి సిద్ధమైన వారు, వివాహేతర బంధాలకు(For extramarital affairs) అలవాటు పడిన వారే ఉండటం విశేషం. ఒంటరిగా ఉంటున్న విశ్రాంత ఉద్యోగులే బాధితుల జాబితాలో ఎక్కువగా ఉన్నట్లు ఓ పోలీసులు అధికారి ఒకరు చెప్పారు.ఇలా మోసపోయిన వారిలో ఎక్కువ మంది బయటకు తెలిస్తే పరువుపోతుందనే ఆందోళనకు గురై వారిలో వారే నరకం అనుభవిస్తున్నారు. ఇలా ఆందోళన చెందినప్పుడు అకస్మాత్తుగా అధిక రక్తపోటు(Blood Pressure)కు గురైనప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ 20 రోజుల్లోనే 13-14 సెక్స్​టార్షన్​ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బయటకు రానివి ఇంకా ఎన్నో.

వీడియో కాల్

ఈ ‘వలపు లేడీలు’ అని పిలవబడుతున్న వారు సామాన్యంగా అర్ధరాత్రి వరకూ ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండే వ్యక్తులను టార్గెట్ చేస్తూ తమ ఆట ప్రారంభిస్తారు.ఇలాంటి కేసుల్లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఉదంతం ఒకటి ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన 65 ఏళ్ల ఉద్యోగ విరమణ(Retirement) పొందిన వ్యక్తి ఓ రోజు రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, అనుకోకుండా వాట్సాప్‌లో ఓ వీడియో కాల్ వచ్చింది. కాల్ చేసినవారు ఓ యువతి. మొదట్లోరాంగ్ నంబర్’ అని చెప్పి కాల్ కట్ చేసిన ఆమె, మరుసటి రోజు మళ్లీ మెసేజ్ చేసి ‘సారీ’ అంటూ మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత వారి మధ్య మాటలు పెరిగి, సన్నిహితంగా మారే స్థాయికి చేరాయి.

Dating Apps

ఇటీవల గుర్తించారు

దీంతో పాటు ఇద్దరూ వీడియో కాల్‌లలో నగ్నంగా మాట్లాడేంతగా సంబంధం పెరిగింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఆమె, తాను స్టాక్ మార్కెట్‌ బ్రోకర్‌ని అంటూ నమ్మించి, పెట్టుబడి పేరిట రూ.1.5 కోట్ల మేర డబ్బు తీసుకుంది.వెబ్​సైట్లు, యాప్​లను అడ్డాగా మార్చుకొని కొందరు యువకులు, మహిళలు సెక్స్​ టార్షన్​కు పాల్పడుతున్నట్లు పోలీసులు ఇటీవల గుర్తించారు. డేటింగ్ ​యాప్​​ల్లో అందమైన ఫొటోలు ఉంచి వారిని ఆకర్షిస్తున్నారు. ఆసక్తి చూపిన వారితో గంటల తరబడి చాటింగ్​ చేస్తూ మార్ఫింగ్​ ఫొటోలు(Morphing photos), వీడియోలు పంపుతూ వారికి మరింత దగ్గర అవుతున్నారు. అకస్మాత్తుగా ఫోన్​ చేసి తాము ప్రమాదంలో చిక్కుకున్నామని అంటూ రూ.లక్షల్లో గుంజుతున్నారు.

Read Also: Telangana Cabinet: కీలక అంశాలపై నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

#DatingAppScam #MatrimonyFraud #OnlineScam #SocialMediaTrap Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.