Cyber Crime: సోషల్ మీడియాలో వస్తున్న యాడ్‌ మోసాలపై సజ్జనార్ హెచ్చరిక

Read Time:  1 min
Cyber Crime: సోషల్ మీడియాలో వస్తున్న యాడ్‌ మోసాలపై సజ్జనార్ హెచ్చరిక
FONT SIZE
GET APP

Cyber Crime: సోషల్ మీడియాలో యధేచ్ఛగా సాగుతున్న యాడ్ మోసాలపై సైబర్ నిపుణుడు, ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ మరోసారి గళమెత్తారు. “ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలతో సరదాగా మాట్లాడండి” అంటూ వచ్చే ప్రకటనల వెనుక ఉన్న భయంకరమైన కోణాన్ని ఆయన బహిర్గతం చేశారు. యువత తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలనే తాపత్రయంలో జీవితాలను పాడుచేసుకోవద్దని ఆయన హెచ్చరించారు..

Read Also: Gadwal Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి!

ఏఐ (AI) సాయంతో మాయాజాలం

యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇది. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు. మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లే. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయి.ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ చేస్తే..

Cyber ​​Crime: Sajjanar warns against ad frauds on social media
Cyber ​​Crime: Sajjanar warns against ad frauds on social media

అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌ సెక్స్‌టార్షన్ కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.

ఆన్‌లైన్‌లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలి. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.