📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

BRS: బీఆర్ఎస్ నేత ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: May 30, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లోని బోరబండ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ సర్దార్ (33) బుధవారం రాత్రి తాను నివాసముంటున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో బోరబండ ఎస్‌ఆర్‌టీ నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, ఆయన భార్య హబీబాషేక్‌(Habibashek)ల వేధింపుల కారణంగానే సర్దార్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.ఎస్‌ఆర్‌టీ నగర్‌(SRT Nagar)లో నివసించే ఎండీ సర్దార్ బుధవారం రాత్రి సమయంలో తన ఇంటి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సర్దార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

వాతావరణం

ఈ ఘటన తెలియగానే సర్దార్ బంధువులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్(Baba Fasiuddin) దంపతుల వేధింపులు భరించలేకనే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ బోరబండ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫసియుద్దీన్ నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.మృతుడు సర్దార్ సోదరుడు ఎండీ ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాబా ఫసియుద్దీన్, ఆయన భార్య హబీబాషేక్‌, ఫసియుద్దీన్ పీఏ సప్తగిరితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన సోదరుడు సర్దార్ ఇటీవల ఇంటి ఆధునికీకరణ పనులు చేపట్టారని, ఈ క్రమంలో ఫసియుద్దీన్ దంపతులు డబ్బులు డిమాండ్ చేస్తూ తీవ్రంగా వేధించారని ఇబ్రహీం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వేధింపులు తట్టుకోలేకనే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు.

BRS: బీఆర్ఎస్ నేత ఆత్మహత్య

డిమాండ్

సర్దార్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Gopinath), మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read Also: Local Body Elections : జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు?

#BorabandaTragedy #BRS #HyderabadNews #JusticeForSardar #MDSardar Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.