మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఇటీవల వెలుగు చూసిన ఒక దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది.ఫర్హాన్ ఖాన్(Farhan Khan) అనే ప్రధాన నిందితుడి నేతృత్వంలోని ఓ ముఠా, హిందూ మతానికి చెందిన విద్యార్థినులను పథకం ప్రకారం లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడటం, వారిని మత మార్పిడికి బలవంతం చేసేందుకు యత్నించడం వంటి దారుణాలకు ఒడిగట్టింది. విచారణలో నిందితుడు పశ్చాత్తాపం చూపకపోగా, హిందూ యువతులపై అత్యాచారం చేయడం తన నమ్మకాల ప్రకారం “పుణ్యకార్యం” అని చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది.ఫర్హాన్ తనపై అత్యాచారానికి పాల్పడి, ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేశాడని 19 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఫర్హాన్ నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు ఇండోర్(Indore)కు పారిపోయినప్పటికీ నిందితుడు ఆమెను వెంబడించి వేధింపులు కొనసాగించాడు.
సాధారణంగా
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫర్హాన్, అతని అనుచరులు ప్రధానంగా ఇతర నగరాల నుంచి భోపాల్(Bhopal)కు చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నారని తేలింది.ఇలాంటి యువతులు ఒంటరిగా ఉండటంతో సులభంగా వలలో వేసుకోవచ్చని ముఠా సభ్యులు భావించినట్లు తెలుస్తోంది. బాధితులను ఆకర్షించడానికి ఈ ముఠా సభ్యులు హిందూ పేర్లతో పరిచయం చేసుకోవడం, ఖరీదైన కార్లతో తిరుగుతూ డబ్బున్న వారిలా నటించడం వంటివి చేసేవారని దర్యాప్తులో వెల్లడైంది.పోలీసుల విచారణలో ఫర్హాన్ తాను “హిందూ అమ్మాయిల జీవితాలను నాశనం చేయడం” అనే ఏకైక లక్ష్యంతోనే ఈ ముఠాను ఏర్పాటు చేశానని, తన చర్యలను ఒకరకమైన “జిహాద్”గా భావిస్తున్నానని అంగీకరించినట్లు సమాచారం. తాను చేసిన నేరాలకు పశ్చాత్తాప పడటానికి బదులుగా గర్వపడుతున్నట్లు నిందితుడు ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు.

విడుదల
దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరింతమంది బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఐదో బాధితురాలు బయటకు వచ్చింది. ఏడాది క్రితం ఫర్హాన్, మరో నిందితుడు అలీ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది.అశోకా గార్డెన్(Ashoka Garden) ప్రాంతంలో భోజనానికి పిలిచి, గంజాయితో నింపిన సిగరెట్ ఇచ్చి మత్తులోకి దించిన తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. ఈ విషయం బయటకు చెబితే అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు విడుదల చేస్తామని నిందితులు బెదిరించినట్లు పేర్కొంది.
Read Also: Firecracker Factory: బాణసంచా కర్మాగారంలో పేలుడుకి ఐదుగురి బలి..ఎక్కడంటే?