📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Covid: కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి

Author Icon By Anusha
Updated: May 25, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌లో కోవిడ్-19 మహమ్మారి మరోసారి భయపెడుతోంది.కోవిడ్-19 కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా మరణం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలోని థానే నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల యువకుడు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయి చికిత్స పొందుతూ మరణించినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్(Thane Municipal Corporation) ప్రకటించింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై మరింత అప్రమత్తతను పెంచింది.ముంబ్రాకు చెందిన ఈ 21 ఏళ్ల యువకుడు మే 22, 2025న థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ వారం గ్రేటర్ ముంబైలో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయి మరణించిన నాల్గవ వ్యక్తి ఈ యువకుడు. ఈ నలుగురికి కూడా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు
సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు.

ఆరోగ్య శాఖ

గత 10 రోజులుగా కోవిడ్-19 కేసుల సంఖ్యలో పెరుగుదల ఉన్నప్పటికీ ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లోని వైద్యులు చాలామంది రోగులలో వ్యాధి తేలికపాటి లక్షణాలతోనే ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి అదుపులోనే ఉందని అక్కడక్కడ మాత్రమే కేసులు నమోదవుతున్నాయని అవి కూడా చాలా అరుదుగా ఉన్నాయన్నాయని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్‌(Internal medicine)లో సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ సురంజిత్ ఛటర్జీ తెలిపారు.ఇటీవలే కర్ణాటకలోని బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణించాడు. శనివారం ఆయనకు కోవిడ్-19 పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయి. నగరంలోని వైట్‌ఫీల్డ్(Whitefield) నివాసి అయిన ఈ వృద్ధుడు మే 17న మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 38 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి వాటిలో 32 బెంగళూరులోనే ఉన్నాయి.

Covid: కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి

అభిప్రాయం

కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కర్ణాటక, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు సూచనలు జారీ చేశాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కోవిడ్-19 కేసులలో పెద్దగా పెరుగుదల లేదని అక్కడక్కడా మాత్రమే కేసులు నమోదవుతున్నాయని తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు.కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో నమోదైన కోవిడ్-19 కేసుల పరిస్థితిని సమీక్షించారు. నమోదవుతున్న కేసులలో చాలా వరకు తేలికపాటి లక్షణాలతోనే ఉన్నాయని,వారు తమ ఇళ్లల్లోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

Read Also: Virat Kohli: అయోధ్యలో హనుమంతుడిని దర్శించుకున్న కోహ్లీ దంపతులు

#BangaloreCOVIDUpdate #Covid19India #CovidAwareness #ThaneCOVIDDeath Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.