📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి..

Woman Dies: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం..గర్భిణీ మృతి

Author Icon By Vanipushpa
Updated: June 20, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఏడు నెలల గర్భిణీ ప్రాణాన్ని బలితీసుకుంది. తాను చనిపోతున్నానని తెలిసిన ఆ తల్లి, చేతిలోని కుమార్తెను రక్షించుకుని తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..బాలానగర్‌(Balanagar)కు చెందిన సయ్యద్‌ జమీర్, ఆస్ర ఫాతిమా(Fathima) (29) దంపతులు అత్తాపూర్‌ పోలీస్​ స్టేషన్ పరిధిలోని ఉప్పర్‌పల్లి(Upperpalli)లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం ఫాతిమా ఏడు నెలల గర్భిణీ. అత్తాపూర్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 90 దగ్గరలోని ఓ ఆసుపత్రిలో భర్త గురువారం ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత తన బైక్​పై భార్యాభర్తలు కుమార్తెతో కలిసి ఇంటికి బయలుదేరారు.

Woman Dies: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం..గర్భిణీ మృతి

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డోరు తీశాడు

రెప్పపాటు కాలంలో : ఇంకాసేపట్లో ఇంటికి చేరుతారు అనే లోపల ప్రధాన రహదారిపై 198వ పిల్లర్‌ దగ్గర ఓ కారు ఆగింది. వెనక వస్తున్న బైక్​ను గమనించకుండా కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఒక్కసారిగా డోరు తీశాడు. దీంతో జమీర్ బైక్ వెళ్లి ఆ డోర్​కు తగలడంతో అదుపుతప్పి పడిపోయింది. బైక్ వెనుక సీట్లో ఉన్న ఫాతిమా, కుమార్తె ఇద్దరూ కుడివైపు పడిపోయారు. అదే సమయానికి అటుగా ఓ ఆర్టీసీ బస్సు(RCT Bus) రావడంతో ఫాతిమా బస్సు వెనక చక్రాల కింద పడిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె రెప్పపాటు కాలంలోనే తన కుమార్తెను దూరంగా నెట్టివేయడంతో చిన్నారి ప్రాణాలు నిలిచాయి. నిర్లక్ష్యంగా కారు డోరు తీసిన వ్యక్తి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ ప్రమాదం అనంతరం పారిపోయినట్టు సమాచారం, అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు, విచారణ ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది – రోడ్డుపై ఒక్క విషయంలో నిర్లక్ష్యం అనేక కుటుంబాల జీవితాలను తుడిచిపెట్టగలదు. తల్లితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆస్ర ఫాతిమా సాహసానికి శతకోటికాలాలు నమస్సులు.

Read Also: Kriti Patel: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ క్రితి పటేల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Car driver's negligence Google News in Telugu Latest News in Telugu leads to death of pregnant woman Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.