Bengaluru Crime: డ్రగ్స్ ఇచ్చి యువతులపై అఘాయిత్యం

Read Time:  1 min
Bengaluru Crime: డ్రగ్స్ ఇచ్చి యువతులపై అఘాయిత్యం
FONT SIZE
GET APP

Bengaluru Crime: కర్ణాటక రాజధాని బెంగళూరులో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 19 మంది యువతులపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది. బాధితులకు తెలియకుండా మత్తు పదార్ధాలు ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.. నగరంలోని సంపన్న వర్గాల పార్టీల ముసుగులో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.

Read Also: Nara Lokesh: 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: ముంబై సదస్సులో లోకేష్ ధీమా

Bengaluru Crime: Rape of young women after giving them drugs
Bengaluru Crime: Rape of young women after giving them drugs

పార్టీలకు పిలిచి.. డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం

నిందితులు యువతులను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టారు. విందులు, వినోద కార్యక్రమాల పేరుతో అమ్మాయిలను పార్టీలకు ఆహ్వానించేవారు. అక్కడ వారికి తెలియకుండానే ఆహారం లేదా పానీయాల్లో డ్రగ్స్ (Drugs) కలిపి ఇచ్చేవారు. బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడేవారని సమాచారం.

ఈ క్రమంలో నిందితులు వీడియోలు కూడా తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నిఖిల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.