Ap: సీఐ వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం..

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

పల్నాడు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్థానిక సీఐ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ధాన్యం వ్యాపారి భార్య కోడూరి జ్యోతి పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి (suicide) పాల్పడింది. రాత్రి వేళ బలవంతంగా స్టేషన్‌కు తీసుకురావడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలను సాయంత్రం 7:30 తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకురాకూడదన్న నిబంధనలు సీఐకి తెలియవా అని ఆమె ప్రశ్నించింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన జ్యోతి కత్తితో తన చేతిని కోసుకుంది.

Read also: CBN : ఇది చంద్రబాబు ప్రభుత్వమని గుర్తుంచుకోండి

బాధితురాలి ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ

గాయపడిన మహిళను అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో స్పష్టమైన నిబంధనలు అమలవుతున్నాయా అనే అంశంపై ప్రజల్లో చర్చ మొదలైంది. బాధితురాలి ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.