📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Gnanashekaran: అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో దోషికి 30 ఏళ్ల జైలు

Author Icon By Vanipushpa
Updated: June 3, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నా యూనివర్సిటీ(Anna University) లైంగిక దాడి కేసులో నిందితుడు జ్ఞానశేఖరన్‌కు చెన్నై(Chennai)లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. మొత్తం పదకొండు అభియోగాల్లోనూ దోషిగా తేలడంతో అతడికి 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.90,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజలక్ష్మి తీర్పు వెలువరించారు. జ్ఞానశేఖరన్‌(Gnanashekaran)పై మోపిన అన్ని అభియోగాలూ రుజువైనట్లు ఈ వారం ప్రారంభంలోనే చెన్నైలోని మహిళా కోర్టు ప్రకటించింది. డాక్యుమెంటరీ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికల ద్వారా నేరం నిరూపితమైందని కోర్టు పేర్కొంది. గతేడాది డిసెంబర్ 23న రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

Gnanashekaran: అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో దోషికి 30 ఏళ్ల జైలు

ఈ దారుణాన్ని వీడియో తీసి ఆపై బ్లాక్‌మెయిల్
కొట్టూరు ప్రాంతానికి చెందిన జ్ఞానశేఖరన్, అన్నా యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో బిర్యానీ స్టాల్ నడుపుతున్నాడు. ఆ రోజు క్యాంపస్‌లోకి అక్రమంగా ప్రవేశించి, నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఒక విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి, ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడి చేశాడు. అంతేకాకుండా, ఈ దారుణాన్ని వీడియో తీసి, బాధితులను బ్లాక్‌మెయిల్ చేసినట్లు కూడా పోలీసులు తెలిపారు. డిసెంబర్ 25న గ్రేటర్ చెన్నై పోలీసులు అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
జ్ఞానశేఖరన్‌కు శిక్ష పడటాన్ని స్వాగతిస్తూనే, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) అధికార డీఎంకే ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దోషిని కాపాడేందుకు డీఎంకే ప్రయత్నించిందని, తమ పార్టీ నిరంతర ఆందోళనల వల్లే జ్ఞానశేఖరన్ చట్టం ముందు నిలబడ్డాడని ఆయన అన్నారు. ఈ కేసులో ఇంకా చాలా మంది నిందితులు ఉండవచ్చని ఈపీఎస్ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే “ఆ సార్ ఎవరు?” (Who is that Sir) ప్రచారం కొనసాగుతోందని తెలిపారు.
రాజకీయ దుమారానికి దారి
జ్ఞానశేఖరన్ అరెస్టు తర్వాత అధికార డీఎంకే నేతలతో అతను దిగిన ఫోటోలు బయటకు రావడం రాజకీయ దుమారానికి దారితీసింది. అతడితో ఎలాంటి సంబంధం లేదని డీఎంకే మొదట చెప్పినప్పటికీ, అతడు పార్టీ పదవిలో ఉన్నాడంటూ ప్రతిపక్షాలు ఫోటోలను షేర్ చేశాయి. జ్ఞానశేఖరన్ డీఎంకే విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్ అని, డీఎంకే నేతలతో ఉన్న ఫోటోలను పంచుకుంటూ బీజేపీ నేత కె. అన్నామలై ఆరోపించారు.
అయితే, తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్. రఘుపతి ఈ ఆరోపణలను ఖండించారు. జ్ఞానశేఖరన్ పార్టీ ఆఫీస్ బేరర్ కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా శాసనసభలో మాట్లాడుతూ “చెన్నై విద్యార్థిని కేసులో అరెస్టయిన వ్యక్తి డీఎంకే సభ్యుడు కాదని నేను హామీ ఇస్తున్నాను. అతను డీఎంకే సానుభూతిపరుడు, దాన్ని మేము కాదనడం లేదు” అని వివరణ ఇచ్చారు.
తన తల్లి అనారోగ్యం దృష్ట్యా శిక్ష తగ్గించాలని విజ్ఞప్తి

కాగా, జ్ఞానశేఖరన్ తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం అనుమానంతోనే తనను అరెస్టు చేశారని పేర్కొంటూ కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేయాలని కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేశాడు. తమిళనాడు పోలీసులు దీనికి వ్యతిరేకంగా కౌంటర్ పిటిషన్ వేశారు. కోర్టు ఇరు పక్షాల వాదనలు వింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. ఈ బృందం దర్యాప్తు పూర్తి చేసి మహిళా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, తమిళనాడు మహిళా వేధింపుల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద జ్ఞానశేఖరన్‌పై అభియోగాలు నమోదు చేశారు. శిక్ష ఖరారుకు ముందు, తన తల్లి అనారోగ్యం దృష్ట్యా శిక్ష తగ్గించాలని జ్ఞానశేఖరన్ కోర్టును అభ్యర్థించాడు.

Read Also: Kadapa: కువైట్ నుంచి వచ్చి అల్లుడిని హతమార్చిన మామ

#telugu News Anna University Ap News in Telugu Breaking News in Telugu convict gets 30 years in jail Google News in Telugu Latest News in Telugu Paper Telugu News sexual assault case Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.